హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. వీళ్లిద్దరూ ఆ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మల్చుకోవాలని భావిస్తున్నారట! నేడు (డిసెంబర్ 1న) కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలిదే పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరలవుతోంది. బరి తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు అని రాసుకొచ్చింది.
అందుకే అక్కడ!
కాగా సమంత.. సమయం దొరికితే చాలు ఈషా ఫౌండేషన్‌కు వెళ్తుంది. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటుంది. ఆ ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే సామ్.. తన పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలనుకుంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది
పెళ్లి- విడాకులు
రాజ్ నిడిమోరు (Raj Nidimoru)- శ్యామలిదే 2015లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య సమస్యలు రావడంతో 2022లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు సమంత (Samantha Ruth Prabhu)- నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్‌లో వీరి వివాహం జరిగింది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడన్‌గా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. 2021 అక్టోబర్‌లో చైసామ్ విడాకులు తీసుకున్నారు.

చదవండి: బిగ్‌బాస్ 9: తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య? ఏడ్చిన దివ్య


