
కొంతమంది ఫోటోలు దిగడంలో దిట్ట. కొందరికేమో సరిగా ఫోటోలు దిగడమే రాదు. హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) రెండో కోవలోకి వస్తుంది. ఫోటో దిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా మరోవైపు బిత్తరచూపులు చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేనెప్పుడు సెల్ఫీ తీసుకున్నా.. కెమెరా వైపు కాకుండా స్క్రీన్‌లో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఇండియన్ అంకుల్స్ ఇలాగే చేస్తారు కదా!
సెల్ఫీ ఫోటోలు
ఇట్స్ ఓకే.. నన్ను ఇండియన్ అంకుల్ అనుకోండి.. మరేం పర్వాలేదు అని క్యాప్షన్ ఇచ్చింది. తను యోగా చేస్తున్న ఫోటోను, తిన్న ఐస్‌క్రీమ్‌ను, అద్దంలోనుంచి బయటకు చూస్తున్న పిక్స్‌ను ఈ పోస్ట్‌లో జత చేసింది. అలాగే రెండు సెల్ఫీ పిక్స్ కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలతో మెప్పించిందీ తెలుగు బ్యూటీ.
సినిమా
హిందీలో.. రామన్ రాఘవ్ 2.0, చెఫ్, ద బాడీ, లవ్ సితార వంటి సినిమాలు చేసింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్ ఫస్ట్, సెకండ్ పార్ట్స్‌లో నటించింది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేసింది. ఓటీటీలో మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో పా.రంజిత్ డైరెక్షన్‌లో 'వెట్టువం' మూవీలో శోభిత యాక్ట్ చేస్తోంది.
చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే?