
సెలబ్రిటీల వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలపైనే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటిది సినీ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్లు ఏం చేసినా వార్తే అవుతోంది. వారి వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు వెలువడుతుంటాయి. ఇదే మంచిది కాదంటున్నారు నటి రష్మికా మందన్నా. ఈ భామ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. నేషనల్ క్రష్‌గా వెలుగొందుతున్న రస్మికా మందన్నా ప్రస్తుతం బాలీవుడ్‌ను దున్నేస్తున్నారనే చెప్పాలి.ఇక తెలుగు,తమిళం భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ని పెళ్లి చేసుకోనున్నట్లు ఆ మద్య చెప్పకనే చెప్పారు.
కాగా ఇటీవల విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ నిశ్చితార్థం చాలా నిడారంబరంగా జరిగినట్లు వార్తలు బలంగానే వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరిలో ఎవరూ బహిరంగంగా వెల్లడించలేదు. ఇలాంటి సరిస్థితుల్లో నటి రష్మిక మందన్నా ఇటవల ఒక భేటీలో పేర్కొంటూ లోపల ఏం జరుగుతోందన్నది ప్రపంచానికి తెలియదన్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లోకి కెమెరా రాకూడదని అన్నారు.తాము వ్యక్తిగత విషయాలను ఆన్‌లైన్ వంటి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించే వాళ్లం కాదన్నారు. అదే విధంగా ప్రజలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఏం అనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదనీ, తమ వృత్తిపరమైన జీవితాల గురించే ముఖ్యం అని పేర్కొన్నారు. రష్మిక మందన్నాకు వివాదాలు కొత్తేమీ కాదు. ఈమెను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందనే ప్రచారం వాడివేడిగా సాగింది. అయితే ఇప్పటి వరకూ తాను బ్యాన్ చేయబడలేదని రష్మిక మందన్నా స్పష్టం చేశారు.
అదే విధంగా ఇంతకు ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నటి రష్మిక మందన్నా ప్రేమ వివాహ నిశ్చితార్థం వరకూ వెళ్లి ఆ తరువాత విడిపోయారు. ఆపై రష్మిక మందన్నా కన్నడ చిత్రాల్లో నటించలేదు. కాంతార చిత్రం విడుదలయిన సమయంలోనూ రష్మికా మందన్నా వివాదాలకు గురయ్యారు. ఆ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని పేర్కొనడంతో పెద్ద రచ్చే జరిగింది. అలాంటిది ఇటీవల కాంతారకు ఫ్రీక్వెల్‌గా రూపొందిన కాంతార ఛాప్టర్ 1 చిత్రాన్ని చూసిన తరువాత ఆ చిత్ర బృందానికి మెసేజ్ పెట్టినట్లు, వాళ్లు అందుకు థ్యాంక్స్ చెప్పినట్లు నటి రషి్మకా మందన్నా పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడు ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు.