
ఒటీటీల క్రేజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. థియేటర్స్ వెళ్లి సినిమా చూసేవారి కంటే..ఓటీటీలో చూసేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో టాప్ 1లో ఉన్న ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని ప్రాంతాల హిట్ సినిమాలు ఎక్కువగా ఇందులోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ఉన్న టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దాం.
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన యాక్షన్ చిత్రం వార్2. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్ టాప్ 10లో మొదటి స్థానంలో ఉండగా.. తెలుగు వెర్షన్ టాప్ 5లో ఉంది.
ఇక టాప్‌లో 2లో మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార చిత్రం హిందీ వెర్షన్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ థియేటర్స్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. రిషబ్ శెట్టి ఖాతాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇక టాప్ 3లో యానిమేషన్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహా’ ఉంది. థియేటర్స్‌లో రూ.320 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీల్లోనూ అదరగొడుతోంది.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గా రిలీజ్ అయిన ‘ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10’ మూవీ టాప్ 4లో కొనసాగుతుంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. సైమన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరా నైట్‌లీ, గై పీర్స్, డేవిడ్ అజాలా కీలక పాత్రలు పోషించారు.
టాప్ 6లో సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రం ఉంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు మృణాల్ ఠాకూర్, రవి కిషన్, రోష్ని వాలియా, విందు దారా సింగ్, దీపక్ దోబ్రియాల్, కుబ్రా సైట్, సంజయ్ మిశ్రా, చుంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో థియేటర్స్‌లో రిలీజై అయిన ఈ చిత్రం.. అపజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా ఈ చిత్రం టాప్ 10లో కొనసాగడం గమనార్హం.
టాప్ 7లో దడక్ 2 ఉంది. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో అత్యంత సున్నితమైన కుల వివక్షను చూపించారు.
టాప్ 8లో బ్లాక్ బస్టర్ మూవీ సయ్యారా కొనసాగుతుంది. ఇక టాప్ 9 లో క్రైమ్ థ్రిల్లర్ ఇన్‌స్పెక్టర్ జెండె ఉంది. ఒకప్పటి నొటోరియస్ బికినీ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ కేసును ఛేదించిన ఓ పోలీసు ఆఫీసర్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ మనోజ్‌బాజ్‌పాయూ లీడ్ రోల్లో నటించారు.
ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఓడుం కుతిర చాదుం కుతిర’టాప్ 10లో కొనసాగుతుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, రేవతి పిళ్లై హీరోయిన్లుగా నటించారు.