
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'సైయారా'(Saiyaara) ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) జంటగా 'సైయారా'తో బాలీవుడ్‌కు పరిచయమ్యారు. వీరిద్దరూ క్రిష్, వాణి పాత్రలతో యూత్ను మెప్పించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్‌తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్గా విడుదలైన 'సైయారా' నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 12న ఓటీటీలోకి రానుందని ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది. అందుకే ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కథేంటి?
వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో భారీ ఫైట్స్ లేవు. పవర్‌ఫుల్ డైలాగ్స్ లేవు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కేవలం ఎమోషన్ మాత్రమే ఈ చిత్రాన్ని నిలబెట్టింది.