
ఇటీవలే విడుదలై లవ్ బర్డ్స్ను తెగ ఏడిపించేసిన సినిమా సయారా. జూలై 18న థియేటర్లలోకి వచ్చిన ఈ బాలీవుడ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రేమకథ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు సయారా చిత్రానికి దాదాపు రూ.500 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్లో అయితే ఏకంగా విక్కీ కౌశల్ ఛావా వసూళ్లు దాటేసింది. అంతలా సూపర్ హిట్గా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. అహాన్ పాండే, అనీత్ పద్దా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం వచ్చేనెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సయారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ సైతం అఫీషియల్గా ప్రకటించే అవకాశముంది.

కాగా.. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో సయారాను తెరకెక్కించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన రొమాంటిక్ చిత్రంగా సయారా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. భారతదేశంలో రూ. 320 కోట్లు వసూలు చేసింది.