బాలీవుడ్‌ ఎంట్రీ | Meenakshi Chowdhury Bollywood entry | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ ఎంట్రీ

Sep 28 2025 12:50 AM | Updated on Sep 28 2025 12:50 AM

Meenakshi Chowdhury Bollywood entry

‘హిట్‌ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు మీనాక్షీ చౌదరి. ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైందని సమాచారం. జాన్‌ అబ్రహాం నటించనున్న హిందీ చిత్రం ‘ఫోర్స్‌ 3’లోని హీరోయిన్‌  పాత్ర కోసం మీనాక్షీ చౌదరిని ఎంపిక చేసిందట యూనిట్‌. భావ్‌ దులియా దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం షూటింగ్‌ ఈ నవంబరులో ప్రారంభం కానుంది. 

ఈ సినిమాలో మీనాక్షి  పాత్రకూ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం ఆమె శిక్షణ తీసుకోనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ మొదలయ్యాయని, కొన్ని వర్క్‌షాప్స్‌ కూడా జరుగుతున్నాయని భోగట్టా. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement