
ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్‌తో బాక్సాఫీస్ రికార్డ్‌లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్‌లో అనేక చిత్రాల కలెక్షన్స్‌ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్‌ను కూడా దాటేసింది.
ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్‌స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మనోజ్ భాజ్‌పాయ్ నటించిన 'ఇన్‌స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్తో తొమ్మిదో స్థానంలో ఉంది.