
హీరోయిన్ రష్మిక చేస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా 'థామా'. భేడియా, స్త్రీ, స్త్రీ 2, ముంజ్య చిత్రాల తర్వాత హారర్ యూనివర్స్‌లో వస్తున్న మూవీ ఇది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: బికినీ ఫొటోలు.. వెటకారంతో క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి)
ట్రైలర్ చూస్తుంటే ఓవైపు భయపెడుతూనే మరోవైపు నవ్విస్తున్నారు. హీరో ఆయుష్మాన్.. వ్యాంపైర్ అవుతాడు. ఇతడి ప్రేమికురాలిగా రష్మిక నటించింది. మరి ప్రియుడిలో దెయ్యం లక్షణాలు వచ్చేసరికి రష్మిక ఏం చేసింది? చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్‌తో మూవీ తీసినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. గతంలో వచ్చిన స్తీ, స్త్రీ 2 చిత్రాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. మరి ఇప్పుడు 'థామా' ఏం చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))