యశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా నయనతార ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె గంగ అనే పాత్రలో కనిపించనున్నారు. ఒక భారీ క్యాసినో బ్యాక్‌డ్రాప్‌లో.. మోడ్రన్ డ్రెస్‌లో గన్ పట్టుకొని పవర్‌ఫుల్ లుక్స్‌తో నయన్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ఆమె హావభావాలు సినిమాలోని ఇంటెన్సిటీని, భారీతనాన్ని తెలియజేస్తున్నాయి.
ఈ పాత్ర గురించి డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'టాక్సిక్'లో నయనతార సరికొత్త నటనా ప్రతిభను చూస్తారు. షూటింగ్ జరుగుతున్న కొద్దీ గంగ పాత్ర ఆత్మకు, నయనతార వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని నేను గమనించాను’ అని ఆమె అన్నారు.
ఈ చిత్రంలో నయనతారతో కలిపి మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే కియరా అద్వానీ, హ్యుమా ఖురేషీకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. కియారా..నదియా పాత్రలో కనిపించగా, ఖురేషీ ఎలిజబెత్ పాత్రలో అలరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
Introducing Nayanthara as GANGA in - A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie
@advani_kiara @humasqureshi #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry… pic.twitter.com/FSiWGo7XeC— Yash (@TheNameIsYash) December 31, 2025


