
సాయిపల్లవి పేరు చెప్పగానే పద్ధతైన పాత్రలు, అద్భుతమైన డ్యాన్సులు గుర్తొస్తాయి. ఇలా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ.. బికినీ వేసుకుందని చెప్పి కొన్ని ఫొటోలని తెగ వైరల్ చేశారు. వారం పదిరోజలుగా ఇవి వైరల్ అయిపోయాయి కూడా. అయితే ఇవి నిజమేనని కొందరు, లేదంటే ఏఐ ఫొటోలని సోషల్ మీడియాలో వాదన జరిగింది. ఇదంతా ఎందుకని చెప్పి స్వయంగా సాయిపల్లవినే ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది.
(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?)
ఈ ఏడాది 'తండేల్' మూవీతో హిట్ కొట్టిన సాయిపల్లవి.. ప్రస్తుతం 'రామాయణ్' అనే హిందీ మూవీలో నటిస్తోంది. కొన్నిరోజుల క్రితం షూటింగ్‌కి గ్యాప్ దొరికేసరికి చెల్లెలు పూజా కన్నన్, మరిదితో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్లింది. ఈ క్రమంలోనే బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసింది. అక్కతో దిగిన కొన్ని ఫొటోల్ని సాయిపల్లవి చెల్లి పూజా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే వీటిని మార్పింగ్ చేసిన కొందరు నెటిజన్లు.. బికినీ వేసుకున్నట్లు ఎడిట్ చేశారు.
తీరా ఇప్పుడు ట్రిప్ ఫుల్ వీడియోతో వచ్చేసిన సాయిపల్లవి.. 'పైన కనిపిస్తున్నవన్నీ నిజంగా తీసిన ఫొటోలు, ఏఐ ఫొటోలు కాదు' అని క్యాప్షన్ పెట్టింది. దీంతో అసలు బికినీ ఫొటోలన్నీ అబద్ధం అని వెటకారంతో క్లారిటీ ఇచ్చినట్లయింది. మరి ఇప్పటికైనా ఆమె ఫ్యాన్స్ నమ్ముతారా లేదంటే నిజంగానే బికినీ వేసుకుందని అనుకుంటారో మరి? సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ గతేడాది పెళ్లి చేసుకుంది. మరి ఈమె ఎప్పుడు చేసుకుంటుందో?
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))