
అల్లు ఫ్యామిలీలో రాబోయే కొన్ని నెలల్లో పెళ్లి జరగబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బన్నీ సోదరుడు శిరీష్.. ప్రస్తుతం కొత్తగా సినిమాలేం చేయట్లేదు. చివరగా గతేడాది 'బడ్డీ' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తర్వాత నుంచి అటు ఇండస్ట్రీలో గానీ ఇటు సోషల్ మీడియాలో గానీ పెద్దగా యాక్టివ్‌గా లేడు. అలాంటిది ఇప్పుడు ఇతడు త్వరలో వివాహం చేసుకోనున్నాడని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))
హైదరాబాద్‌కి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ కుమార్తెతో శిరీష్‌కి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారని.. ఇంతలో అల్లు అరవింద్ తల్లి కనకరత్నం చనిపోవడంతో ఇది కాస్త వాయిదా పడిందని వినిపిస్తుంది. వెంటనే కానప్పటికీ రాబోయే కొన్ని నెలల్లో అల్లు ఫ్యామిలీ నుంచి శుభవార్త అయితే రానుందనే టాక్ వినిపిస్తుంది.
మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. తండ్రులు కూడా అయిపోయారు. నిహారిక వివాహం చేసుకుంది కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నారు. వీళ్లలో ఇప్పుడు శిరీష్.. పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 11 ఏళ్లలో మూడే సినిమాలు.. అసలు ఎవరీ సుజిత్?)