
విజయ్ దేవరకొండ( Vijay Devarakonda), రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ డైరెక్ట్గా తమ ప్రేమ విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పకపోయినా.. చాలాసార్లు హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన వారితోనే ప్రేమలో ఉన్నానని గతంలో విజయ్ చెప్పాడు. రష్మిక కూడా సింగిల్ కాదంటూ.. చెప్పేసింది. ఇలా పరోక్షంగానే ప్రేమ విషయాన్ని చెప్పిన ఈ జంట..ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఆ విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. మీడియాతో వార్తలు రావడం.. వాటిని వీరిద్దరు ఖండించకపోవడంతో ఎంగేజ్‌మెంట్ జరిగింది నిజమనే అంతా నమ్మారు. తాజాగా ఈ జంట తమ నిశ్చితార్థం విషయాన్ని కూడా పరోక్షంగానే అభిమానులతో పంచుకున్నారు.
విజయ్ అలా.. రష్మిక ఇలా
విజయ్-రష్మికల ఎంగేజ్‌మెంట్ ఈ నెల 3న జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఉంగరాలు మార్చుకున్నారట. ఈ విషయాన్ని మొదట విజయ్ పరోక్షంగా బయటకు తెలియజేశాడు. ఇటీవల ఆయన పుట్టపర్తికి వెళ్లాడు. అక్కడ ఆయన చేతికి ఉంగరం కనిపించింది. గతంలో ఎప్పుడూ ఉంగరం ధరించని విజయ్ చేతికి.. కొత్త రింగ్ కనిపించడంతో ఇది కచ్చితంగా ఎంగేజ్మెంట్దే అంటూ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా తన నిశ్చితార్థం విషయాన్ని పరోక్షంగానే బయటపెట్టింది. ఇన్స్టాలో తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో రష్మిక చేతికి డైమండ్ ఉంగరం ఉంది. అది హైలెట్ చేసేలా ఆ వీడియో ఉంది. దీంతో రష్మిక కూడా ఎంగేజ్‌మెంట్ విషయాన్ని బయటకు చెప్పడానికే ఆ వీడియో పెట్టిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
అలా ప్రేమలో..
రష్మిక-విజయ్ కలిసి నటించిన తొలి సినిమా ‘గీత గోవిందం’. ఆ సినిమాలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. అప్పటికే వీరిద్దరు ప్రేమలో ఉన్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక ‘థామా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. విజయ్.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు రవి కిరణ్ కోలాతోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రోజు ఈ సినిమా పూజాకార్యక్రమం జరిగింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది.