
రష్మిక హీరోయిన్‌గా చేస్తున్న లేటెస్ట్ హిందీ సినిమా 'థామా'. 'స్త్రీ' యూనివర్స్ నుంచి వస్తున్న కొత్త మూవీ ఇది. అక్టోబరు 21న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో పాటలు మాత్రం ప్రతిదీ ఐటమ్ సాంగే అనిపిస్తుంది. తాజాగా రిలీజైన సాంగ్‌లో అయితే 51 ఏళ్ల బ్యూటీ అదిరిపోయే స్టెప్పులేయడం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
'థామా' నుంచి తాజాగా 'పా*యిజన్ బేబీ' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇది కూడా పార్టీ నేపథ్యంగా సాగే గీతం అర్థమవుతోంది. తొలుత మలైకా అరోరా గ్లామరస్‌గా కనిపిస్తూ స్టెప్పులేయగా, చివరలో రష్మిక కూడా మలైకతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇదే కాదు గతంలో 'దిల్‌బర్' అంటూ సాగే మరో పాట రిలీజ్ చేశారు. ఇందులో నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది. ఇది ఐటమ్ సాంగ్. అంతకుముందు రష్మిక పాట కూడా చూడటానికి ఐటమ్ సాంగ్‌లానే అనిపిస్తుంది. చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటు ఐటమ్ గీతాలు చాలానే ఉన్నాయి!
(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ కృతి శెట్టి, కల్యాణి బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్)