ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Mirage Movie OTT Release Date Announced, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Mirage OTT: 'దృశ్యం' దర్శకుడి కొత్త మూవీ.. ఓటీటీ రిలీజ్‌కి రెడీ

Oct 14 2025 12:17 PM | Updated on Oct 14 2025 3:33 PM

Mirage Movie OTT Telugu Streaming Details

'దృశ్యం' సినిమా అనగానే చాలామందికి దర్శకుడు జీతూ జోసెఫ్ గుర్తొస్తాడు. ఎందుకంటే థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రస్తుతం మూడో పార్ట్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే జీతూ లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్దమైంది. ఇంతకీ ఈ థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? దీని సంగతేంటి అనేది చూద్దాం.

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'మిరాజ్'. అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబరు 19న రిలీజైన ఈ థ్రిల్లర్.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీన్ని అక్టోబరు 20 నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి సోనీ లివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు వీడియో కూడా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)

'మిరాజ్' విషయానికొస్తే.. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్న కిరణ్ (హకీమ్ షాజహాన్) సడన్‌గా అభిరామి (అపర్ణ బాలమురళి).. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడే కిరణ్.. రైలు ప్రమాదంలో చనిపోయాడనే విషయం తెలిసి షాక్ అవుతుంది. దీని నుంచి తేరుకునేలోపు ఓ పోలీస్ ఆఫీసర్ (సంపత్ రాజ్), ఓ రౌడీ (శరవణన్), ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఆసిఫ్ అలీ).. అభిరామిని హార్డ్ డిస్క్ కోసం ప్రశ్నించడం మొదలుపెడతారు. ఇంతకీ ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? కిరణ్‌కి ఏమైంది? వీళ్లందరి సాయంతో అభిరామి.. ఈ ప్రమాదం నుంచి బయటపడిందా లేదా అనేది మిగతా స్టోరీ.

ఇకపోతే ఈ వారం 24 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్‌, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్‌లో సడన్ సర్‌ప్రైజులు కూడా ఉండొచ్చు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement