breaking news
Mirage Movie
-
మిరాజ్ మూవీ రివ్యూ: ఇది ట్విస్ట్ ల మిస్టరీ!
సినిమా పరంగా ఓ కథను ప్రేక్షకుడికి ఆకట్టుకునేలా చెప్పాలంటే గట్టి పట్టున్న స్క్రీన్ ప్లే ఎంతైనా అవసరం. మామూలు రొటీన్ ఫార్ములాతో వచ్చే సినిమాలు నేటి ప్రేక్షకులకు అంతగా రుచించట్లేదు. చెప్పే కథను ఊహకందని ట్విస్టులతో చూపిస్తే ఆ సినిమా హిట్టే. అదే కోవకు చెందిన సినిమా మిరాజ్(Mirage). ఈ సినిమా మాతృక మళయాళమైనా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సోనీ లివ్ లో లభ్యమవుతోంది. అపర్ణ రాసిన ఈ కథకు ప్రముఖ మళయాళ దర్శకులు జీతూజోసెఫ్ దర్శకత్వం వహించారు. సుప్రసిద్ధ మళయాళ నటులు ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి ఈ సినిమాకు ప్రధాన తారాగణం. ఈ మధ్య కాలంలో ఆసాంతం సూపర్ ట్విస్టులతో సాగిపోయే సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో చాలా నెమ్మదిగా ప్రారంభమైనా శుభం కార్డు వరకు ట్విస్టులతో ప్రేక్షకుల మతిని పోగొడుతుందీ సినిమా. అయితే ఈ సినిమాలో అక్కడక్కడా కొంచం రీరికార్డింగ్ నిరాశపరుచవచ్చు. కాని సినిమా ట్విస్టుల పరంగా చూస్తే మాత్రం గడిచిన దశాబ్ద కాలంలో ఇటువంటి సినిమా రాలేదనుకోవచ్చు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్సిడెంతో కథ మొదలవుతుంది. ఈ ట్రైన్ లో కిరణ్ అనే పాత్ర పరిచయమవుతుంది. అభిరామి, కిరణ్ ఒకే ఆఫీసులో పని చేస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళిద్దరూ ప్రేమించుకుని త్వరలో పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటారు. ఇంతలో కిరణ్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి అభిరామికి తెలిసి కుప్పకూలిపోతుంది. అభిరామిని ఓదార్చడానికి తన స్నేహితురాలైన రితిక వస్తుంది. ఆ తరువాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అశ్విన్, పోలీస్ సూపరిండెంట్ ఆరుముగంతో పాటు ఆఫీసులో రాజకుమార్ మనిషి కూడా అభిరామి దగ్గరకు వస్తారు. వీళ్ళంతా అభిరామిని పరమార్శించడానికైతే కాదు, చనిపోయిన కిరణ్ దగ్గరున్న ఓ డేటా డ్రైవ్ కోసం వస్తారు. ఇంతకీ ఆ డేటా డ్రైవ్ లో ఏముంది, ఆఖర్లో అది ఎవరికి దక్కుతుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ ట్విస్టుల మిస్టరీ మిరాజ్ ని చూడాల్సిందే. గమ్మత్తేమిటంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఓ ట్విస్ట్ తోనే ఉంటుంది. అది కూడా ప్రేక్షుకుడి ఊహలకు అంచనాలు మించి ఉంటాయి ఈ ట్విస్టులు. మంచి థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ కనువిందనే చెప్పాలి. మస్ట్ వాచ్ మూవీ దిస్ మిరాజ్, సో గెట్ ట్విస్టెడ్ దిస్ వీకెండ్.-హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'దృశ్యం' సినిమా అనగానే చాలామందికి దర్శకుడు జీతూ జోసెఫ్ గుర్తొస్తాడు. ఎందుకంటే థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రస్తుతం మూడో పార్ట్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే జీతూ లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్దమైంది. ఇంతకీ ఈ థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? దీని సంగతేంటి అనేది చూద్దాం.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'మిరాజ్'. అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబరు 19న రిలీజైన ఈ థ్రిల్లర్.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీన్ని అక్టోబరు 20 నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు వీడియో కూడా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)'మిరాజ్' విషయానికొస్తే.. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్న కిరణ్ (హకీమ్ షాజహాన్) సడన్‌గా అభిరామి (అపర్ణ బాలమురళి).. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడే కిరణ్.. రైలు ప్రమాదంలో చనిపోయాడనే విషయం తెలిసి షాక్ అవుతుంది. దీని నుంచి తేరుకునేలోపు ఓ పోలీస్ ఆఫీసర్ (సంపత్ రాజ్), ఓ రౌడీ (శరవణన్), ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఆసిఫ్ అలీ).. అభిరామిని హార్డ్ డిస్క్ కోసం ప్రశ్నించడం మొదలుపెడతారు. ఇంతకీ ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? కిరణ్‌కి ఏమైంది? వీళ్లందరి సాయంతో అభిరామి.. ఈ ప్రమాదం నుంచి బయటపడిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం 24 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)


