బిగ్‌బాస్ సీజన్-9లో ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కల్యాణ్-పవన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అదే సమయంలో రీతూపై సంజన చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ అయ్యాయి. ఈ వారం నామినేషన్‌లో కల్యాణ్ అయితే పూర్తిగా కంట్రోల్ తప్పి రీతూపై రెచ్చిపోయాడు. తను అమ్మాయి అనే సంగతి కూడా మర్చిపోయి మీదకి దూసుకెళ్లాడు. దీంతో కల్యాణ్‌ను ఆపేందుకు డీమాన్ పవన్ మధ్యలో రావడంతో పరిస్థితి మరింత పెద్దదైంది.
కల్యాణ్, డీమాన్ పవన్‌ల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో కల్యాణ్ పీకని డీమాన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు. ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్‌లో నాగార్జున ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కల్యాణ్ పీకని డీమాన్ పట్టుకున్న ఘటన గురించి సంజన పదేపదే హౌస్‌లో తీసుకొస్తుంది. దీంతో పవన్‌కు ఎక్కువ బ్యాడ్ నేమ్ రావచ్చని మరుసటిరోజు రీతూ జోక్యం చేసుకుంది.
గొడవ కల్యాణ్‌తో జరిగింది కాబట్టి అతనితోనే రీతూ మాట్లాడింది. 'అసలు డీమాన్ ఏం చేశాడు నీ దగ్గరకు వచ్చి అంటూ కల్యాణ్‌ను రీతూ ప్రశ్నించింది. దీంతో కల్యాణ్ కూడా ఇలా సమాధానం చెప్పాడు. 'గొడవ జరిగిన సమయంలో వాడు నా పీక పట్టుకున్నాడని చెబుతున్నారు.' అని తెలిపాడు. దానికి రీతూ కూడా ఇలా చెప్పింది. వాడి ఎమోషన్ గురించి నీతో పాటు హౌస్‌లో ఉన్న వారందరికీ తెలుసు. జరిగిన గొడవలో నీ మీద వాడికి (డీమాన్) కోపం లేదు. నిన్ను ఆపేందుకే మాత్రమే వాడు వచ్చాడు. అనుకోకుండా జరిగిన విషయాన్ని సంజన చెడుగా చూపుతూ మాట్లాడుతుంది. ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియడం లేదు. వాడిని ఇలా ఎన్నిసార్లు తొక్కేస్తారు రా..' అంటూ రీతూ బాధపడుతుంది. అయితే, కల్యాణ్ కూడా డీమాన్‌కు అండగా మాట్లాడాడు. వీకెండ్‌లో నాగార్జున గారు ఏదైనా అడిగితే పెద్ద గొడవ ఏం జరగలేదని చెబుతానంటూ వెళ్లిపోయాడు.


