తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో ఫస్ట్ నుంచి బోలెడంత పాపులారిటీ ఉన్న వ్యక్తి తనూజ. అందుకే అందరికంటే ముందుగా ఈమె విన్నింగ్ రేసులోకి వచ్చింది. మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరి నిజంగా వార్ వన్‌సైడ్ అయిందా? తనూజయే గెలుస్తుందా స్పెషల్ స్టోరీలో చూసేద్దాం.
తనూజ చుట్టూ బిగ్‌బాస్ 9
ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కానెక్టయిన వ్యక్తి తనూజ (Thanuja Puttaswamy). గేమ్స్ తనవరకు వస్తే బాగానే ఆడుతుంది. తన తప్పు ఉందని ఎవరైనా అంటే గట్టిగా వాదిస్తుంది. షో మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే గేమ్ అంతా తనచుట్టూనే ఎక్కువగా తిరిగింది. కాకపోతే తనపై తనకు నమ్మకం తక్కువ.
బలమైన ఓటింగ్
అన్నింటికీ సపోర్టింగ్ గేమ్ కావాలనుకుంటుంది. అలాగైతే ఈజీగా గెలిచేస్తానని తన అభిప్రాయం. కానీ వీకెండ్‌లో మాత్రం తనకెవరూ సపోర్ట్ చేయడంలేదని అవలీలగా అబద్ధం చెప్తుంది. ఇలా రెండు నాలుకల మాటలు తనకు వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయినప్పటికీ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో (ఓటీటీ సీజన్ మినహా) తొలి లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. తనకు అభిమానులతో పాటు సీరియల్ ప్రేక్షకుల ఓటింగ్ ఆ రేంజ్‌లో ఉంది.
నెక్స్ట్ పవన్ కల్యాణ్ పడాల
మొదట్లో కల్యాణ్ (Pawan Kalyan Padala) ఎందుకున్నాడు? అని జనాలే విమర్శించారు. అమ్మాయిలను అదోలా చూస్తూ ఛాన్స్ దొరికితే వారి చేయి పట్టుకుంటూ కాస్త తేడాగా ప్రవర్తించాడు. కానీ, నాగ్ ఎప్పుడైతే చేతులు పిసకడం ఆపేయ్ అని ముఖం పట్టుకుని అన్నాడో అప్పుడే తన పంథా మార్చుకున్నాడు. కల్యాణ్ అంటే ఏంటో చూపించాడు. గేమ్సై్ బాగా ఆడాడు. కాకపోతే నామినేషన్స్ తీసుకునేవాడు కాడు. ఇది టాప్ 5కి సరిపోతుంది. గెలుపుకు కాదు. ఇక్కడ అతడి ఫ్యాన్స్ జవాన్ అన్న కార్డు ఉపయోగించారు.
మరో పల్లవి ప్రశాంత్
జై జవాన్ అంటూ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. ఏడో సీజన్‌లో రైతు బిడ్డ అనే ఏకైక సింపతీ కార్డుతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. ఇప్పుడదే విధంగా సైనికుడు అనే కార్డుతో కల్యాణ్ టైటిల్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతడి పీఆర్ స్ట్రాటజీలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. జై జవాన్ జై కిసాన్ అంటూ సోషల్ మీడియాలో ఆల్‌రెడీ నినాదాలు మొదలుపెట్టారు.
మంచోడే కానీ ఎక్కువ హైప్
కల్యాణ్‌కు యాక్టింగ్ అంటే ఇష్టం.. ఇక్కడ అవకాశాలు వస్తే సైనిక వృత్తిని వదిలేస్తా అని అతడు ఓపెన్‌గా చెప్పినాస సరే ఓ సైనికా.. అంటూ పాటలు, మీమ్స్‌తో కావాల్సినదానికంటే ఎక్కువ హైప్ తీసుకొస్తున్నారు. దీంతో ఓటింగ్‌లోనూ తనూజతో పోటీపడే స్థాయికి చేరుకున్నాడు. పైగా బిగ్‌బాస్ టీమ్ కూడా ఈ మధ్య కల్యాణ్‌ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్ అతడిని గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మిగిలింది ఇమ్మాన్యుయేల్
ఇమ్మాన్యుయేల్ (Emmanuel) ఆల్‌రౌండర్. గేమ్స్ వచ్చాయంటే ప్రాణం పెట్టి ఆడతాడు. మిగతా సమయాల్లో కడుపుబ్బా నవ్విస్తాడు. కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. భయపడకుండా ఆడాలి. అది ఇమ్మూకి లేదు. నామినేషన్స్ అంటే భయం. ఎవరైనా నామినేట్ చేస్తే నిలువెల్లా వణికిపోతాడు. దాదాపు 10 వారాలపాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం మైనస్ అయింది. కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడటం కూడా జనాల్లో కాస్త నెగెటివిటీ తీసుకొచ్చింది. అయినప్పటికీ అతడికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి.
సూట్‌కేస్ తీసుకోవడం మేలు
కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. ఓట్ల సంఖ్య మరింత పుంజుకోవాలి. ఒకవేళ ఫైనల్‌లో తన స్థానం టాప్ 3 అని తెలిస్తే మాత్రం అతడు లక్షలు ఉన్న సూట్‌కేస్ తీసుకోవడమే ఉత్తమం. తన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బయినా పనికొస్తుంది. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ 9కు శుభం కార్డు పడనుంది. మరి ఈ లోపు ఓటింగ్‌ను తారుమారు చేసేలా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి!
చదవండి: బిగ్‌బాస్9 : చివరి కెప్టెన్‌గా కల్యాణ్? పవన్ ఓడించి మరీ..


