కేరళ స్టోరీ–2 విడుదలకు హైకోర్టు పచ్చజెండా  | Kerala High Court lifts stay on Kerala Story 2 release | Sakshi
Sakshi News home page

కేరళ స్టోరీ–2 విడుదలకు హైకోర్టు పచ్చజెండా 

Feb 28 2026 4:13 AM | Updated on Feb 28 2026 4:13 AM

Kerala High Court lifts stay on Kerala Story 2 release

ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు

కొచ్చి: కేరళ స్టోరీ–2 సినిమా విడుదలకు ఎట్టకేలకు అడ్డంకి తొలగించింది. షెడ్యూల్‌ ప్రకారం విడుదల చేసేందుకు కేరళ హైకోర్టు అనుమతించింది. గురువారం ఈ సినిమా విడుదలపై 15 రోజులపాటు స్టే విధిస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలివ్వడం తెల్సిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సినిమా నిర్మాత విపుల్‌ అమృత్‌లాల్‌ షా గురువారం రాత్రి అప్పీల్‌ చేశారు. 

అన్ని నిబంధనలను అనుసరిస్తూ సినిమాను విడుదలకు సిద్ధం చేశామని, మత ఉద్రేకాలను రెచ్చగొట్టే అంశాలేవీ లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన దేశంలోని 1,500 థియేటర్లతోపాటు విదేశాల్లోని 300 థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. విడుదల ఆగిపోతే ఆర్థికంగా దివాళాతీయడం తప్పదని తెలిపారు. పిటిషన్‌ను శుక్రవారం విచారించిన జస్టిస్‌ సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి, జస్టిస్‌ పీవీ బాలకృష్ణన్‌ల ధర్మాసనం ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై స్టే ఇచి్చంది. 

సినిమా విడుదల చేసుకునేందుకు నిర్మాతకు అనుమతి ఇచ్చింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సరి్టఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) సినిమా సర్టిఫికేషన్‌ మార్గదర్శకాలను పాటించలేదని సింగిల్‌ జడ్జి భావించడం కేవలం కొన్ని క్లిప్పింగ్‌ల ఆధారంగానే జరిగిందని భావిస్తున్నాం. మొత్తం సినిమాను చూడకుండా వెలువరించిన ఆ తీర్పును సమరి్థంచలేం, అంగీకరించలేం’అని తీర్పులో పేర్కొంది. 

సీబీఎఫ్‌సీ సూచనల మేరకు నిర్మాత షా సినిమాలో మార్పులు, చేర్పులతోపాటు, కొన్ని దృశ్యాలను తొలగించారు. సరి్టఫికెట్‌ ఇచ్చే సమయంలో బోర్డు తన విచక్షణను పూర్తిగా ఉపయోగించిందనే వాస్తవం దీనివల్ల స్పష్టమవుతోందని ధర్మాసనం తెలిపింది. సంబంధిత అధికారులు శాంతిభద్రతలు సహా అన్ని మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్నారని పరిగణలోని తీసుకున్నారని ప్రాథమికంగా భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. సినిమా విడుదల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే, తగు చర్యలు చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement