
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమాతో వస్తున్నాడు. 'కె ర్యాంప్' పేరుతో తీసిన ఈ చిత్రం.. దీపావళి కానుకగా ఈ శనివారం (అక్టోబరు 18) థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఇతడు.. ఒక్కడే ఊళ్లు తిరుగుతూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఓ మీడియా మీట్ సందర్భంగా పలువురు అభిమానులు, మూవీ లవర్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న రాగా కిరణ్ నుంచి 'వద్దు' అనే సమాధానం వచ్చింది.
'పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా 'ఓజీ' మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్‌పీరియెన్స్ ఎలా అనిపించింది' అని ఓ వ్యక్తి.. కిరణ్ అబ్బవరంని అడిగాడు. దీనికి కిరణ్ నుంచి 'ఇప్పుడు వద్దు బ్రో' అనే సమాధానమొచ్చింది. అయితే ఎందుకు నో చెబుతున్నాననే దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడు నా సినిమా 'కె ర్యాంప్' రిలీజ్ ఉంది. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబితే దానికోసం ఎక్కువ వాడుకుంటున్నారేమో, ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తెగుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు అది వద్దు. మరీ అన్నిసార్లు అభిమానం గురించి పదేపదే చెప్పడం కరెక్ట్ కాదు' అని కిరణ్ అబ్బవరం నుంచి సమాధానం వచ్చింది.
(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)
కిరణ్ చెప్పింది నిజమేనేమే! ఎందుకంటే గతంలో ఒకరిద్దరు తెలుగు హీరోలు.. తమ సినిమాల రిలీజ్ టైంలో పవన్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు చాలా మాటలు చెప్పేవారు. కిరణ్ అబ్బవరం ఈ సమాధానం చెబుతుంటే అవే సంఘటనలు గుర్తొచ్చాయి. 'కె ర్యాంప్' విషయానికొస్తే.. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీశారు. కేరళ బ్యాక్ డ్రాప్‌లో మొత్తం స్టోరీ అంతా జరగనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటోంది.
'కె ర్యాంప్'తో పాటు ఈ వీకెండ్ ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్.. లిస్టులో ఉన్నాయి. అయితే ఎవరికి వాళ్లు గట్టిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మరి వీళ్లలో ఎవరు హిట్ కొడతారనేది చూడాలి? ప్రస్తుతానికి అన్ని చిత్రాల ట్రైలర్స్ బాగున్నాయి. కాకపోతే ఏది నిలబడి గెలుస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఇలియానా.. మూడోసారి తల్లి కాబోతుందా?)