
కొన్నేళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేసి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న.. ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఏడాది జూన్ 19న రెండో కుమారుడికి జన్మనిచ్చింది. కానీ మూడు రోజుల క్రితం ఇలియానా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో బేబీ బంప్‌తో కనిపించింది. దీంతో మూడోసారి తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి అసలు విషయం?
గోవాకు చెందిన ఇలియానా.. 2006లో వచ్చిన 'దేవదాస్' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పోకిరి, జల్సా, మున్నా, కిక్, జులాయి తదితర టాలీవుడ్ మూవీస్‌తో క్రేజ్ సంపాదించింది. 2012లో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌కి వెళ్లింది. తర్వాత తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. అలా అని హిందీలో ఏమైనా కలిసొచ్చిందా అంటే లేదు. పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్‌లో 2018లో 'అమర్ అక్బర్ ఆంటోని' మరో ప్రయత్నం చేసింది. కానీ కలిసిరాలేదు.
(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులోనూ మలైకా ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్)
అయితే 2014లోనే మన దేశ పౌరసత్వాన్ని విడిచిపెట్టిన ఇలియానా.. పోర్చుగీస్ పౌరసత్వం తీసుకుంది. అప్పటినుంచి అడపాదడపా హిందీ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో మైఖేల్ డోలన్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. 2023 ఆగస్టులో తొలిబిడ్డకు జన్మనివ్వగా.. అదే ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ కాగా.. ఈ ఏడాది జూన్‌లో రెండో కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి కీను రాఫే డోలన్ అని పేరు పెట్టారు.
ఇలియానా తాజాగా పోస్ట్ చేసిన విషయానికొస్తే.. ఇందులో బేబీ బంప్‌తో కనిపించింది. కానీ ఇది రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న వీడియోలా అనిపిస్తుంది. ఇప్పుడు పోస్ట్ చేయడంతో మళ్లీ ప్రెగ్నెంట్ అయిందా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రూమర్స్ నిజం కాదనిపిస్తోంది. ఒకవేళ అలా ఉంటే అనౌన్స్ చేసేదిగా!
(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)