
మంచు మనోజ్ మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. కొన్నినెలల క్రితం 'భైరవం' రిలీజై మిశ్రమ స్పందన అందుకుంది. కానీ గత నెలలో 'మిరాయ్'లో మనోజ్ చేసిన విలనిజానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా కొన్ని భారీ సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. అలా హిట్ ఇచ్చిన ఆనందంలో ఉన్న మనోజ్.. అడపాదడపా మూవీ వేడుకల్లోనూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ అవార్డ్స్ ఫంక్షన్‌కి భార్యతో పాటు వచ్చాడు.
ఈ కార్యక్రమంలోనే యాంకర్ రవి మాట్లాడుతూ.. మనోజ్‌లో మీకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? అని మౌనికని అడగ్గా.. చాలా గొప్ప స్నేహితుడు అని చెప్పింది. మర్చిపోలేని సందర్భం ఏదైనా ఉంది అని అడిగితే.. ఓ రోజు నాకు క్షమాపణ చెబుతూ లెటర్ రాశాడు. కానీ నాకు అర్థం కాక మళ్లీ అడిగానని నవ్వుతూ మౌనిక చెప్పుకొచ్చింది. పక్కనే ఉన్న మనోజ్.. లెటర్ ఎప్పుడు రాశానా అని గుర్తుతెచ్చుకుని ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. ఈ ప్రోమోలో విషయాన్ని సగం సగం చెప్పినట్లు చూపించారు. మొత్తం ఎపిసోడ్‌లో మనోజ్ ఆ లేఖ ఎందుకు రాశాడు? ఏం రాశాడనేది మౌనిక బయటపెడుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్)
మనోజ్, మౌనికని 2023లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఇది రెండో పెళ్లి. అయినాసరే పెద్దల్ని ఒప్పించి ఒక్కటయ్యారు. వీళ్ల ప్రేమకు గుర్తుగా గతేడాది కూతురు కూడా పుట్టింది. ప్రస్తుతం మనోజ్.. అటు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో మనస్పర్థలు, గొడవలు జరిగినప్పటికీ ఇప్పుడు అవన్నీ సర్దుబాటు అయినట్లే కనిపిస్తున్నాయి. 'మిరాయ్' రిలీజ్ టైంలో చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అని విష్ణు ట్వీట్ చేశాడు. మనోజ్ పేరుని ట్వీట్‌లో ప్రస్తావించనప్పటికీ అన్నదమ్ముల మధ్య అంతరం తగ్గిందనే టాక్ అయితే వినిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)