
‘‘చిన్నప్పుడు ‘ఓ స్త్రీ రేపు రా, లంకె బిందెలు’ వంటి కథలు విన్నప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. వెంకట్ ‘జటాధర’(Jatadhara Movie) కథ చెప్పినప్పుడు అంతే థ్రిల్‌గా అనిపించింది. మా సినిమా చూసినప్పుడు ఆడియన్స్ థియేటర్స్‌లో అదే థ్రిల్ ఫీల్ అవుతారు’’ అని సుధీర్‌బాబు(Sudheer Babu) తెలిపారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఝాన్సీ కీలక ΄ాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్‌ని హీరో మహేశ్‌బాబు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘జటాధర’లో అద్భుతమైన కథ, భావోద్వేగాలు ఉంటాయి. ధన పిశాచి అనే పవర్‌ఫుల్ రోల్‌లో సోనాక్షి నటనను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మా సినిమా ఒక ధమ్ బిర్యానీలా తయారైంది’’ అని చెప్పారు.
‘‘జటాధర’ నా తొలి తెలుగు సినిమా. ధన పిశాచిలాంటి పాత్ర నేనిప్పటివరకూ చేయలేదు’’ అని తెలిపారు సోనాక్షీ సిన్హా. ‘‘బ్రహ్మ’ నా తొలి తెలుగు చిత్రం. మళ్లీ ‘జటాధర’తో తెలుగుకి రావడం హ్యాపీగా ఉంది’’ అని శిల్పా శిరోద్కర్ పేర్కొన్నారు. ‘‘మా ‘జటాధర’ పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం’’ అని ఉమేశ్ కుమార్ బన్సల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్ తెలి΄ారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. ఈ సినిమాని గట్టిగా ఎంజాయ్ చేస్తారు. ఇందుకు 100 శాతం మాది గ్యారంటీ’’ అని వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ అన్నారు.