
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా పా న్స్ ఇండియా సినిమా ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రేరణ అరోరా సమర్పణలో జీ స్టూడియోస్‌పై ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్స్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి ‘ధన పిశాచి రాబోతోంది’ అంటూ ఓ సాంగ్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ సోనాక్షీ సిన్హా పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘సెప్టెంబర్ 30న ధన పిశాచి రాబోతోంది.. చెడు నయా అవతారాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ క్యాప్షన్‌ని జత చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌ని బట్టి చూస్తే డబ్బు అంటే పిచ్చి ఉన్న పాత్రలో సోనాక్షి కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా, క్రియేటివ్ ప్రోడ్యూసర్: దివ్యా విజయ్.