breaking news
Jatadhara Movie
-
సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా
తెలుగులో ఈ వీకెండ్ చాలా సినిమాలు రిలీజయ్యాయి. రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్'తో పాటు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా చిత్రాలతో పాటు ఆర్యన్, డీయస్ ఈరే లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. వీటితోనే రిలీజైన సుధీర్ బాబు 'జటాధర'కు మాత్రం తొలి షో నుంచే తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం షాకింగ్ అనిపిస్తున్నాయి.ఈ వారాంతం రిలీజైన సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ చిత్రాలు ఉన్నంతలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. జనాలు థియేటర్లకు వస్తున్నారు గానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదా అనిపిస్తుంది. ఎందుకంటే మేకర్స్ వైపు నుంచి ఎలాంటి పోస్టర్స్ బయటకు రాలేదు. మరోవైపు తెలుగు-హిందీలో రిలీజైన 'జటాధర' టీమ్ మాత్రం కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..)తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ సాధించగా.. రెండు రోజులకు కలిపి రూ.2.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. పాజిటివ్ టాక్ ఏ మాత్రం రాని 'జటాధర'కు ఈ రేంజు వసూళ్లు రావడం అంటే ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు. వీకెండ్ పూర్తయ్యేసరికి మరి ఏ మూవీ రేసులో ముందు ఉంటుందో చూడాలి?'జటాధర' విషయానికొస్తే.. రుద్రారం అనే ఊరిలోని ఓ ఇంట్లో దాచిన లంకె బిందెలకు ఓ ధన పిశాచి (సోనాక్షి సిన్హా) కాపలా ఉంటుంది. ఓసారి బంధనానికి విఘాతం కలిగి ధనపిశాచి రక్తాన్ని మరుగుతుంది. దీంతో ఊరంతా ఖాళీ అయిపోతుంది.. మరోవైపు శివ(సుధీర్ బాబు) అనే ఘోస్ట్ హంటర్.. సైంటిఫిక్‌గా దెయ్యాలు లేవని నిరూపిస్తూ ఉంటాడు. శివకు తరుచుగా ఓ బాబుని అతడి తల్లి చంపుతున్నట్లు పీడకల వస్తూ ఉంటుంది. ఈ పీడకలకు, ధనపిశాచికి, శివకు మధ్య సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 20 ఏళ్ల యువతిపై 'అనుపమ పరమేశ్వరన్' ఫిర్యాదు) -
రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఈ వారం తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' మాత్రమే ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది. మరి తొలిరోజు దీనితో పాటు రిలీజైన సినిమాల సంగతేంటి? కలెక్షన్స్ ఎంత వచ్చాయని టాక్ వినిపిస్తుంది? ఇంతకీ వీటిలో ఏయే సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' విషయానికొస్తే.. విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అలా దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.1.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం తొలిరోజు కంటే రెండో రోజు వచ్చేసరికి నాలుగురెట్ల వసూళ్ల పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. బహుశా వీకెండ్ తర్వాత చేస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!)మహేశ్‌బాబు బావమరిది సుధీర్‌బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. హీరోతో పాటు కొందరు మాత్రమే తెలుగు నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి కనీస వసూళ్లయినా వస్తాయా అనేది చూడాలి.వీటితో పాటు తిరువీర్ హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందని అంటున్నారు. ఇదొకటి వచ్చిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలీదు. కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చుంటాయి. ఇవి కాకుండా 'ఆర్యన్', 'డీయస్ ఈరే' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించట్లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే రష్మిక సినిమా మాత్రమే ప్రస్తుతానికి లీడ్‌లో ఉంది.(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
‘జటాధర’ మూవీ రివ్యూ
టైటిల్: జటాధరనటీనటులు: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల,ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్ తదితరులునిర్మాతలు: ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందాదర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాసంగీతం: రాజీవ్ రాజ్విడుదల తేది: నవంబర్ 7, 2025కథేంటంటే..శివ(సుధీర్ బాబు) దెయ్యాలు ఉన్నాయని నమ్మని ఓ ఘోస్ట్ హంటర్. సైన్స్‌ని మాత్రమే నమ్ముతూ.. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగిన చోటికి వెళ్లి రీసెర్చ్ చేస్తుంటాడు. అతని తల్లిదండ్రులకు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) ఈ విషయం తెలియదు. ఓ రోజు ప్రముఖ ఘోస్ట్ హంటర్ మణిశర్మ(అవసరాల శ్రీనివాస్) అసిస్టెంట్ అంకిత్ అనుమానాస్పదంగా మరణించడంతో.. శివ రుద్రారం అనే గ్రామానికి వెళ్తాడు. ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతారు. ఆ గ్రామానికి వెళ్లకూడదంటూ శివ గతం గురించి చెబుతారు. శివ గతం ఏంటి? రుద్రారం గ్రామానికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి? ధన పిశాచి(సోనాక్షి సిన్హా) ఆ గ్రామంలోనే ఎందుకు తిష్ట వేసింది? ధన పిశాచి వల్ల శివ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి? తన పేరెంట్స్ ఆత్మలకు శాంతి కలిగించేందుకు శివ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. ఎలా ఉందంటే..నిధుల కోసం తవ్వకాలు.. వాటికి రక్షణగా క్షుద్రశక్తులు ఉండడం.. దెయ్యాలు అంటే నమ్మని హీరో అనుకోకుండా అక్కడికి వెళ్లడం.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆ ప్రాంతంతో హీరోకి సంబంధం ఉందనే విషయం తెలియడం.. చివరకు దైవశక్తి సహాయంతో హీరో క్షుద్రశక్తులను అంతం చేయడం.. మైథలాజికల్ జానర్లో వచ్చే హారర్ చిత్రాల నేపథ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే ప్రేక్షకులను ఎంత మేరకు థ్రిల్‌కి గురిచేశారనేదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. కాస్త భయపెట్టి.. ప్లాష్‌బ్యాక్ స్టోరీని ఎమోషనల్‌గా తీర్చిదిద్దితే చాలు సినిమాని హిట్ చేస్తారు. జటాధరలో అది మిస్సయింది. ఇటు పూర్తిగా భయపెట్టనూ లేదు.. అటు ఎమోషనల్గానూ ఆకట్టుకోలేకపోయారు. కథలో కొత్తదనం ఎలాగూ లేదు.. కథనాన్ని అయినా కాస్త ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేయలేదు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా హైప్ ఇచ్చే సీన్ కనిపించదు. శివుడి ఎపిసోడ్ కూడా పూర్తిగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయారు. ఒకప్పుడు నిధులను ఎందుకు భూమిలో పాతిపెట్టేవారో వివరిస్తూ కథను ప్రారంభించారు దర్శకులు. ఆ నిధులకు రక్షణగా బంధనం వేసేవారని.. అందులో ధన పిశాచి బంధనం అతి భయంకరమైనదంటూ ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ఘోస్ట్ హంటర్‌గా హీరోని పరిచయం చేశారు. దెయ్యాలు లేవని ఎందుకు బలంగా నమ్ముతున్నాడో వివరిస్తూ ఓ ప్లాష్‌బ్యాక్ స్టోరీ చెప్పడం వరకు కథనం ఇంట్రెస్టింగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కథనం చప్పగా సాగుతుంది. ఘోస్ట్ హంటర్‌గా హీరో చేసే విన్యాసాలు ఆకట్టుకోకపోగా.. సాగదీతగా అనిపిస్తాయి. మధ్యలో వచ్చే హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్ మొత్తం కథనం అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యమధ్యలో వచ్చిన ధన పిశాచి ప్రేక్షకులను భయపెట్టలేకపోయింది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. కానీ ద్వితీయార్థంలో వచ్చే ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా సాగదీసినట్లుగానే ఉంటుంది. ఒక్క సీన్లో చెప్పాల్సిన కథని ఐదారు సీన్లలో చెప్పినట్లుగా అనిపిస్తుంది. ధన పిశాచి ఎపిసోడ్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు. ఇక చివరిలో వచ్చిన శివుడి ఎపిసోడ్ కూడా ప్రేక్షకుడిలో జోష్ నింపలేకపోయింది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని చెబుతూ శుభం కార్డు వేశారు. ఎవరెలా చేశారంటే.. సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉండడంతో ఆయన పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. దివ్య ఖోస్లా పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. నటన పరంగా పర్వాలేదు. కానీ సుధీర్‌కి జోడీగా మాత్రం సెట్ కాలేదనే చెప్పాలి. నెగెటివ్ షేడ్ ఉన్న శోభ పాత్రలో శిల్పా శిరోద్కర్ ఒదిగిపోయింది. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా.. లుక్పరంగా భయంకరంగా ఉన్నా.. ప్రేక్షకుడిని భయపెట్టడంలో మాత్రం విఫలం అయింది. ఆమె పాత్రకు పెద్ద డైలాగులు కూడా లేవు. గట్టిగా నవ్వడం.. అరవడం తప్ప ఆమెకు సరైన డైలాగులే పడలేదు. రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్ విభాగం పనితీరు జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
శివ తాండవం కోసం పది రోజులు ప్రాక్టీస్ చేశాను
‘‘దెయ్యం వేట, ఫ్యామిలీ ఎమోషన్, భక్తి, శివుడు గురించి కథలు... ఇలా చాలా లేయర్స్ ఉన్న చిత్రం ‘జటాధర’. అరుణాచల ప్రస్తావన కూడా ఉంది. మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలకి సొల్యూషన్‌గా ఈ మూవీ చేశాం. ఈ సినిమా చేయడానికి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నన్ను చాలా ఎగ్జయిట్ చేసింది. యాక్షన్, ఫ్యామిలీ, మైథాలజీ... ఇలా అన్ని భావోద్వేగాలు కుదిరిన సినిమా ‘జటా ధర’’ అని సుధీర్ బాబు తెలిపారు. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రధారులు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు... → చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు విని ఉంటాం. గతంలో బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి, ఒక బంధనం వేసేవారని, దానికి ఒక పిశాచి కాపలాగా ఉండేదని ఓ కథ ప్రచారంలో ఉండేది. అలాంటి కథని ప్రజెంట్ టైమ్‌లోకి తీసుకొచ్చి మా ‘జటాధర’లో చాలా ఆసక్తిగా చూపించాం. ఈ చిత్రకథ విన్నప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ కథలా అనిపించింది. ఈ సినిమాలో దెయ్యాల వేటగాడిలా కనిపిస్తాను. అయితే తనకి మాత్రం దెయ్యాలున్నాయంటే నమ్మకం ఉండదు. దేవునిపై నమ్మకం ఉంటుంది. సైన్స్‌ని నమ్ముతాడు. అలా ఎందుకు? అనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏ, బీ, సీ సెంటర్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమా ఇది. ధన పిశాచి పాత్రలో సోనాక్షీ సిన్హా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. శిల్పా శిరోద్కర్గారు శోభ అనే బలమైన పాత్రలో అద్భుతంగా నటించారు. → రాజీవ్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఈ మూవీలో శివతాండవం ఎపిసోడ్ ఉంటుంది. నేనెప్పుడూ క్లాసికల్ డ్యాన్స్ చేయలేదు. ఆ సీక్వెన్స్ కోసం దాదాపు పది రోజులు ప్రాక్టీస్ చేసి, చేశాను. చిత్ర పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకి అవకాశాలు సులభం అని... కొత్తవాళ్లకి, ఇండస్ట్రీ నేపథ్యం లేనివారికి కష్టం అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. నిజానికి బయటవాళ్లకే కాదు.. నాకు కూడా కష్టమే. → మా సినిమాలో శివుడు కనిపించే ఒక ఎపిసోడ్ ఉంది. అక్కడ సూపర్‌స్టార్ కృష్ణ గారిని చూపించాలనుకున్నాం. కానీ వీఎఫ్ఎక్స్కి ఎక్కువ సమయం కుదరలేదు. ఈ మూవీలో కృష్ణగారు కానీ, మహేశ్ బాబుగారు కానీ కనిపించరు. ఇక నా తర్వాతి చిత్రం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఉంటుంది. కాన్సెప్ట్ పరంగా అది ఒక ‘బాహుబలి’ లాంటి సినిమా. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాల్సి ఉంది. -
'మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి'.. జటాధర రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం 'జటాధర'(JATADHARA Release Trailer). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి అనే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్‌తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్ కట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది. -
తెలుగు ఇండస్ట్రీని చూసి నేర్చుకోండి: సోనాక్షి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సోనాక్షి రోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నవంబర్ 7న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లతో బిజీగా ఉన్న బాలీవుడ్ నటి సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు పరిశ్రమలో పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంది.దక్షిణాది సినీ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలని సోనాక్షి సిన్హా అభిప్రాయం వ్యక్తం చేసింది. దక్షిణాది సినీ పరిశ్రమలో సమయపాలన పాటిస్తారని తెలిపింది. తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వస్తే సాయంత్రం ఆరు వరకే ఉంటుందని.. ఈ విషయంలో వారిని అభినందించాల్సిందేనని అన్నారు. వారిని చూసి బాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాలని హితవు పలికింది. బాలీవుడ్లో అర్ధరాత్రి వరకు షూటింగ్స్ జరుగుతుంటాయని విమర్శించింది. సౌత్‌లా చేయాలంటే క్రమశిక్షణ అవసరమని సోనాక్షి వెల్లడించింది. తెలుగు చిత్ర పరిశ్రమను చూసైనా బాలీవుడ్ మారాలని సలహా ఇచ్చింది.తన మొదటి తెలుగు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..' స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. గతంలో నేను (లింగా) ఒక తమిళ సినిమా చేశా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చేశా. ఎల్లప్పుడూ ఇలాంటి చిత్రాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ అంతకు ముందు నా షెడ్యూల్ కుదరక సినిమాలు ఒప్పుకోలేదు' అని చెప్పిందిఆ తర్వాత వర్క్ లైఫ్ ప్రస్తావిస్తూ..' హిందీ, తెలుగు సినిమా పని సంస్కృతిని పోల్చి చూస్తే.. దక్షిణది పరిశ్రమలో సమయపాలన గ్రేట్. అక్కడ పని, లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంది. ఈ విషయాన్ని వారి నుంచి మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సెట్లోని క్రమశిక్షణ తనకు ప్రత్యేకంగా అనిపించింది. ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వెళ్తే.. ఆరు గంటల తర్వాత అస్సలు షూట్ చేయరు. అది నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణను అంగీకరించాల్సిన విషయం' అని తెలిపింది. కాగా.. జటాధర మూవీలో ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. -
ధన పిశాచి సర్ప్రైజ్ చేస్తుంది: నిర్మాత ప్రేరణ అరోరా
‘‘నేను హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ నాకు తెలుగు సినిమాలు, తెలుగు సంస్కృతి అంటే చాలా ఇష్టం. రామ్‌చరణ్‌గారి ‘ఆరెంజ్’ చిత్రం చూశాను. అప్పట్నుంచి తెలుగు సినిమాలను ఫాలో అవుతున్నాను. ఇండియన్ సినిమాకి తెలుగు పరిశ్రమ గొప్ప చిత్రాలను అందించింది. తెలుగులో సినిమా చేయాలనే నా కల ‘జటాధర’ సినిమాతో నెరవేరడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చే చిత్రం ఇది’’ అని చెప్పారు నిర్మాత ప్రేరణ అరోరా. సుధీర్‌బాబు, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్‌లో, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’.ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రేరణ అరోరా మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ అంశాలు, ఎమోషన్స్, మైథలాజికల్, సూపర్ నేచురల్ విషయాలు, ఆశ, అత్యాశ... ఇలా అన్ని అంశాలు ‘జటాధర’లో చక్కగా కుదిరాయి.సుధీర్‌గారు చేసిన క్యారెక్టర్, ఆయన పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌కు గుర్తుండిపోతాయి. సోనాక్షీ సిన్హాగారు చేసిన ధన పిశాచి క్యారెక్టర్ ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంది. ఈ పాత్రకు సోనాక్షినే పర్ఫెక్ట్ చాయిస్. సుధీర్‌బాబు–సోనాక్షిల మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు అలరిస్తాయి. శిల్పాగారి క్యారెక్టర్ కాస్త నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. ఇంకా ఈ చిత్రంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం, నాగబంధం, పిశాచి బంధం, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలను చూపించాం. ఈ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండే స్కోప్ ఉంది. తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా చేయనున్నాం’’ అని చెప్పారు. -
ఫిల్మ్‌నగర్ బాధలు తెలుసు: సుధీర్‌బాబు
‘‘ఒక్క సినిమా చాలు అనుకున్న నేను 20 సినిమాలు చేశాను. వీటిలో హిట్ చిత్రాలకు కారణం నా కష్టమైతే ఫెయిల్యూర్స్‌కి కారణం కూడా నేనే. మహేశ్‌గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా, నేను అడగలేదు. నేను ఇరవై సినిమాలు చేయడానికి కారాణం ఒక్కటే. కృష్ణగారి అల్లుడు, మహేశ్‌గారి బావ... సుధీర్‌బాబు. అయితే నా యాక్షన్ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీస్‌కి తిరిగాను. నాకు కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు కానీ ఫిల్మ్‌నగర్ బాధలు తెలుసు. అవకాశాల కోసం బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు.ఇవన్నీ నేను సింపతీ కోసం చెప్పట్లేదు. మీరందరూ (వేడుకలో వీక్షకులను ఉద్దేశిస్తూ..) మహేశ్బాబుగారిపై ప్రేమతోనే వచ్చారు. థ్యాంక్యూ సో మచ్. కానీ ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారని, నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారని నా మనసుకు తెలుస్తోంది. నేను మరింత కష్టపడతాను’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌లో, శిల్పా శిరోద్కర్ కీ రోల్లో నటించిన చిత్రం ‘జటాధర’.ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను చేసిన 20 సినిమాల్లో ‘జటాధర’ బెస్ట్ స్క్రిప్ట్. ఇందులో ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం శివ తాండవం చేయడం అద్భుతమైన అనుభూతి. ఇది ఆ శివుని దీవెనగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు శివిన్, ప్రేరణ. -
'జటాధర' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడిగా చిత్ర యూనిట్ (ఫోటోలు)
-
నవంబర్ బాక్సాఫీస్.. అందరికీ చాలా కీలకం
తెలుగులో చాలావరకు పెద్ద సినిమాలన్నీ పండగల్ని టార్గెట్ చేసుకుని థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ ఏడాదికి అన్ని పండగలు అయిపోయాయి. మిగిలింది క్రిస్మస్ మాత్రమే. దానికి ఇంకా చాలా సమయముంది. నవంబరులో ఎప్పుడూ చెప్పుకోదగ్గ రిలీజులేం ఉండవు. ఈసారి మాత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకుంటాయనే పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ నవంబరులో థియేటర్లలోకి వచ్చే తెలుగు సినిమాలేంటి? వాటి సంగతేంటి?గత రెండు నెలలు (సెప్టెంబరు, అక్టోబరు) టాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడింది. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్ చిత్రాలతో కాస్త హిట్ కళ కనిపించింది. నవంబరులోనూ అలా అరడజనుకు పైగా కాస్త పేరున్న మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో రష్మిక ద 'గర్ల్ ఫ్రెండ్', దుల్కర్ సల్మాన్ 'కాంత', రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి.(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి సర్ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్) తొలివారంలో రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్' రానుంది. ఇది హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. ఎందుకంటే ఈమె చేసిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ట్రైలర్ అయితే డిఫరెంట్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ కలిగించింది. మరోవైపు మహేశ్ బాబు బావమరిది సుధీర్ బాబు 'జటాధర'తో ఈ వారమే రానున్నాడు. ప్రస్తుత ట్రెండ్ అయిన సూపర్ నేచురల్ ఎలిమింట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. ఇది హిట్ కావడం కూడా హీరోకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా సుధీర్ బాబుకి హిట్ లేదు. వీటితో పాటు తిరువీర్ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రం కూడా ఇదే వారం రానుంది.రెండో వారంలో దుల్కర్ సల్మాన్ 'కాంత' వస్తుంది. ఓ దర్శకుడు, హీరో, హీరోయిన్.. వాళ్ల మధ్య ఈగో అనే కాన్సెప్ట్‌తో తీసిన పీరియాడిక్ మూవీ ఇది. గతేడాది 'లక్కీ భాస్కర్' అనే స్ట్రెయిట్ తెలుగు మూవీతో హిట్ కొట్టిన దుల్కర్.. ఈసారి కూడా హిట్ కొడితే టాలీవుడ్లో సెటిలైపోవచ్చు. ఇదే రోజున చాందిని చౌదరి 'సంతాన ప్రాప్తిరస్తు' అనే మూవీ రానుంది. దీనిపై పెద్దగా అంచనాల్లేవు.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)మూడోవారానికి ప్రస్తుతానికి కొత్త సినిమాలేం షెడ్యూల్ కాలేదు. చివరి వారంలో మాత్రం రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఒక్కటే రానుంది. మాస్‌ని నమ్ముకుని గత రెండు మూడు మూవీస్‌తో పూర్తిగా నిరాశపరిచిన రామ్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇతడి కోరిక 'ఆంధ్రా కింగ్ తాలుకా'తోనైనా నెరవేరుతుందా అనేది చూడాలి? ఈ చిత్రంతో పాటు 'కాంత'లోనూ భాగ్యశ్రీ బోర్సేనే హీరోయిన్. అంటే రెండు వారాల గ్యాప్‌లో భాగ్యశ్రీ రెండు చిత్రాలతో తన అదృష్టం పలకరించుకోనుంది.పైన చెప్పిన సినిమాలే కాకుండా మోహన్ లాల్ 'వృషభ' (నవంబరు 06), కృష్ణలీల (నవంబరు 7), ప్రేమిస్తున్నా (నవంబరు 07), స్కూల్ లైఫ్ (నవంబరు 14), ధనుష్ హిందీ మూవీ 'తేరే ఇష్క్ మే' (నవంబరు 28) తదితర సినిమాలు కూడా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన) -
మహేశ్‌బాబు స్వాగతం చెప్పడం ఆనందం: శిల్పా శిరోద్కర్
‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జటాధర’. ఇందులో స్టన్నింగ్ విజువల్స్, అద్భుతమైన సంగీతం, బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని నటి శిల్పా శిరోద్కర్ చెప్పారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ పంచుకున్న విశేషాలు...⇒ తెలుగులో నేను నటించిన తొలి చిత్రం ‘బ్రహ్మ’ (1992). ఆ తర్వాత తెలుగు సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ‘జటాధర’ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇందులో శోభ అనే ప్రాధాన్యం ఉన్నపాత్ర చేశాను. తనకి డబ్బంటే అత్యాశ. ఎలాగైనా సరే అనుకున్నది చేరుకోవాలి అనుకునేపాత్ర. ఈ క్యారెక్టర్ చేయడం సవాల్‌గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటిపాత్ర నేనెప్పుడూ చేయలేదు. అయితే మా డైరెక్టర్స్ వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ క్లియర్ విజన్, సపోర్ట్‌తో ఈపాత్రని చేయగలిగా.⇒ మహేశ్‌బాబుగారు మా ‘జటాధర’ ట్రైలర్ లాంచ్ చేయడం, ట్రైలర్ బాగుందని ఆయన కితాబివ్వడంతోపాటు టాలీవుడ్‌కి నాకు స్వాగతం చెప్పడం సంతోషాన్నిచ్చింది. నమ్రత శిరోద్కర్ (శిల్ప సోదరి)కి కూడా ట్రైలర్, నాపాత్ర నచ్చాయి. సుధీర్‌బాబుగారు మాకు బంధువే అయినప్పటికీ సెట్లో మేం కేవలం ఆర్టిస్టులం మాత్రమే. సుధీర్‌గారితో కలిసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. సోనాక్షీ సిన్హా చేసిన ధన పిశాచిపాత్ర చాలా బాగుంటుంది. నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు.⇒ చిత్ర పరిశ్రమలో తెలుగు, హిందీ వంటి సరిహద్దులు ఇప్పుడు లేవు. ప్రస్తుతం తెలుగు సినిమా బెస్ట్ ఫేజ్‌లో ఉంది. కంటెంట్ పరంగా, టెక్నికల్‌గా అడ్వాన్స్ అయ్యాం. ‘జటాధర’ సినిమా కోసం తెలుగు, హిందీ... ఇలా అన్ని చోట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబరు 7న ప్రేక్షకులు అద్భుతమైన సినిమాని చూడబోతున్నారు. నాకు రొమాంటిక్ కామెడీపాత్రలంటే ఇష్టం. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణం పట్ల హ్యాపీగా ఉన్నాను. మంచిపాత్రలు, సినిమాలు చేసి, ప్రేక్షకులను అలరించాలన్నదే నా కల. ఇకపై తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తాను. -
‘జటాధర’ ధమ్ బిర్యానీలా ఉంటుంది : సుధీర్ బాబు
‘‘చిన్నప్పుడు ‘ఓ స్త్రీ రేపు రా, లంకె బిందెలు’ వంటి కథలు విన్నప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. వెంకట్ ‘జటాధర’(Jatadhara Movie) కథ చెప్పినప్పుడు అంతే థ్రిల్‌గా అనిపించింది. మా సినిమా చూసినప్పుడు ఆడియన్స్ థియేటర్స్‌లో అదే థ్రిల్ ఫీల్ అవుతారు’’ అని సుధీర్‌బాబు(Sudheer Babu) తెలిపారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఝాన్సీ కీలక ΄ాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో మహేశ్‌బాబు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘జటాధర’లో అద్భుతమైన కథ, భావోద్వేగాలు ఉంటాయి. ధన పిశాచి అనే పవర్ఫుల్ రోల్లో సోనాక్షి నటనను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మా సినిమా ఒక ధమ్ బిర్యానీలా తయారైంది’’ అని చెప్పారు. ‘‘జటాధర’ నా తొలి తెలుగు సినిమా. ధన పిశాచిలాంటి పాత్ర నేనిప్పటివరకూ చేయలేదు’’ అని తెలిపారు సోనాక్షీ సిన్హా. ‘‘బ్రహ్మ’ నా తొలి తెలుగు చిత్రం. మళ్లీ ‘జటాధర’తో తెలుగుకి రావడం హ్యాపీగా ఉంది’’ అని శిల్పా శిరోద్కర్ పేర్కొన్నారు. ‘‘మా ‘జటాధర’ పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం’’ అని ఉమేశ్ కుమార్ బన్సల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్ తెలి΄ారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. ఈ సినిమాని గట్టిగా ఎంజాయ్ చేస్తారు. ఇందుకు 100 శాతం మాది గ్యారంటీ’’ అని వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ అన్నారు. -
సుధీర్ బాబు 'జటాధర' సినిమా ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
సుధీర్ బాబు జటాధర.. ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది. కాగా.. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. 'పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవాడు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ కథను ధనపిశాచి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సోనాక్షి సిన్హా ధనపిశాచి పాత్రలో విశ్వరూపం చూపించింది. నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా కథేంటో ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులను తెలిసిపోతోంది. -
ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా...
‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా... ట్రెండ్ సెట్ చెయ్...’ అంటూ సుధీర్‌బాబుతో ఆడి పాడుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రేయా శర్మ. సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ కీలక పాత్రలు ΄ోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న రిలీజ్ కానుంది. రాయిస్, జైన్, సామ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ట్రెండ్ సెట్ చెయ్...’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని బుధవారం విడుదల చేశారు. పబ్ నేపథ్యంలో సాగే ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించగా, స్ఫూర్తి జితేందర్, రాజీవ్ రాజ్ పాడారు. జీతూ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జటాధర’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ.. భయపెట్టేలా సాంగ్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జటాధర. ఈ మూవీలో పాన్ ఇండియా మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో పాటను విడుదల చేశారు.జటాధర మూవీలోని ధన పిశాచి అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా..సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటకు సమీర్ కొప్పికర్ సంగీతమందించారు. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. సోనాక్షి సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. -
ధన పిశాచి రాబోతోంది!
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా పా న్స్ ఇండియా సినిమా ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రేరణ అరోరా సమర్పణలో జీ స్టూడియోస్‌పై ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్స్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి ‘ధన పిశాచి రాబోతోంది’ అంటూ ఓ సాంగ్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ సోనాక్షీ సిన్హా పోస్టర్ని విడుదల చేశారు. ‘‘సెప్టెంబర్ 30న ధన పిశాచి రాబోతోంది.. చెడు నయా అవతారాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ క్యాప్షన్‌ని జత చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ని బట్టి చూస్తే డబ్బు అంటే పిచ్చి ఉన్న పాత్రలో సోనాక్షి కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా, క్రియేటివ్ ప్రోడ్యూసర్: దివ్యా విజయ్. -
ఓం నమః శివాయ.. జటాధర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులు. సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్గురువారం ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ను విడుదల చేశారు. ఈ ట్రాక్‌లో ‘ఓం నమః శివాయ’ అంటూ వినిపిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడారు. ‘‘మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ‘జటాధర’ చిత్రం చూపించబోతోంది. పౌరాణిక ఇతివృత్తాలు, సూపర్ విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీ మ్యూజిక్ కో. చదవండి: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ -
శివుడి పెయింటింగ్ అద్భుతంగా వేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) నటుడు మాత్రమే కాదు, తనలో మరో కళ కూడా ఉంది. అదే పెయింటింగ్ కళ! తాజాగా అతడు తన చేతులతో ఓ అద్భుతాన్ని సృష్టించాడు. నీలకంఠుడి పెయింటింగ్ వేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. నేను ఎవరి పెయింటింగ్ వేస్తున్నాననుకుంటున్నారు? ఎవరైనా అందమైన అమ్మాయిల బొమ్మలు గీస్తుంటారు. అందగాడి బొమ్మ గీస్తున్నా..కానీ నేను ఒక అందగాడి బొమ్మను గీస్తున్నా.. ఆయన ఎలాంటి అందగాడంటే అందాన్ని చందమామతో పోలుస్తాం కదా.. ఆ చందమామ ఆయన తలలో ఏదో ఒక మూలన పడి ఉంటుంది. అసలాయన అందం ముందు చందమామను ఎవరూ పట్టించుకోరు. మనమంతా అందంగా కనిపించడానికి మంచిగా హెయిర్‌స్టైల్ చేసుకుంటే ఆయనేమో జుట్టునసలు పట్టించుకోనే పట్టించుకోడు. అందుకే ఆయన జుట్టు ఎప్పుడూ ఏదో దారాలు చిక్కుక్కున్నట్లు చిక్కుముడుల్లా ఉంటుంది. ఆ బొమ్మే జటాధరఅందుకే ఆయన్ని జటాధర అని పిలుస్తారు. ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలి. అందుకోసం నేనో బొమ్మ (సినిమా) తీశాను.. ఆ బొమ్మే జటాధర. అందరూ థియేటర్లలో జటాధర చూడండి అని చెప్పుకొచ్చాడు. జటాధర విషయానికి వస్తే.. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని దర్శక ద్వయం వెంకట్ కల్యాణ్– అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించారు. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై సంజనా చీప్ కామెంట్స్ -
సరికొత్త లోకం
సుధీర్‌బాబు, సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. దర్శక ద్వయం వెంకట్ కల్యాణ్– అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని నవంబరు 7న విడుదల చేయనున్నట్లు సోమవారం అధికారికంగా వెల్లడించారు మేకర్స్. ‘‘ఒక ఫోక్ టేల్ నుంచి పుట్టిన అద్భుతమైన కథే ‘జటాధర’. స్టోరీ టెల్లింగ్, సినిమా స్కేల్, విజన్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఓ సరికొత్త లోకంలోకి తీసుకువెళుతుంది.. అలాగే గొప్ప అనుభూతిని ఇస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మహేశ్ బాబు మరదలు రీ ఎంట్రీ.. టాలీవుడ్ మూవీతోనే!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ 'జటాధర'. ఈ మూవీని డివోషనల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా..ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సోనాక్షి సిన్హా విలన్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె శోభ అనే పాత్రలో మెప్పించనుంది. తాజా పోస్టర్ చూస్తుంటే ఫుల్ అగ్రెసివ్ రోల్ చేస్తునట్లు అర్థమవుతోంది. శిల్పా శిరోద్కర్ ఇటీవలే హిందీ బిగ్‌బాస్‌లో అలరించిన సంగతి తెలిసిందే.తన పాత్ర శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ.. 'జటాధారలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రేక్షకులను అతీంద్రియ ప్రయాణంలోకి తీసుకెళ్లే చిత్రం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కథ కూడా చాలా ప్రభావం చూపుతుంది. ప్రేరణ అరోరాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. శోభ పాత్రను పోషించడం సవాల్‌తో కూడుకున్న పని. ఈ పాత్రను మనసు పెట్టి చేశా. ప్రత్యేకమైన పాత్ర పోషించడం అద్భుతంగా అనిపిస్తోంది. తెరపై నన్ను నేను చూసుకునేందుకు ఆసక్తిగా ఉన్నా' అని పంచుకుంది.కాగా.. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ సిస్టర్ అయిన శిల్పా శిరోద్కర్ చాలా కాలం నుంచి సినిమాలకు విరామం తీసుకుంది. ప్రస్తుతం దుబాయిలో సెటిల్ అయినా ఆమె ఈ సినిమా పాత్ర నచ్చడంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, ప్రేరణా అరోరా సహకారంతో శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్ నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుం అరోరా ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్‌లో విడుదలకానుంది.#ShilpaShirodkar stuns as Shobha in #Jatadhara – power, intensity & mysticism all in one frame!✨ @Shilpashirodkr @ZeeStudios_ @isudheerbabu @SonakshiSinha #shilpashirodkar #sonakshisinha #Sudheerbabu #zeestudios #JATADHARA pic.twitter.com/DwCTt4QsHL— GOODTIMES (@mygoodtimes) August 28, 2025 -
జటాధరలో సితార
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా మరో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కీలకమైన సితారపాత్రలో దివ్య ఖోస్లా నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, ప్రేరణా అరోరా సహకారంతో శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుం అరోరా ఈ సినిమాకు సహ–నిర్మాతలు. ఈ చిత్రంపాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్‌లో విడుదలకానుంది. -
విలన్‌గా ప్రముఖ హీరోయిన్.. 'జటాధర' టీజర్ రిలీజ్
యంగ్ నటుడు సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇదివరకే లుక్స్ రిలీజ్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. స్టోరీ ఏంటనేది చూచాయిగా క్లారిటీ ఇచ్చారు. సోనాక్షి ఇందులో విలన్ తరహా పాత్రలో కనిపించనుంది.(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)బంగారు ఆభరణాలతో సోనాక్షి పాత్ర కనిపిస్తుండగా.. సాధారణ మనిషిగా ఉండే హీరో సోనాక్షితో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటనేదే సినిమా స్టోరీలా అనిపిస్తుంది. వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో త్వరలో థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: రెండు జడలతో నాని ఫస్ట్ లుక్.. ఫుల్ క్రేజీ) -
పరమశివుడిగా సూపర్‌స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా?
సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 'జటాధర' మూవీ యూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. ఈ క్రమంలో కృష్ణని స్మరించుకుంటూ ఆయన పరమశివుడు రూపంలో ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చర్మిష్మా' అని రాసుకొచ్చారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'జటాధర' సినిమా షెడ్యూల్ రీసెంట్గా పూర్తి చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)పాన్ ఇండియా మూవీగా తీస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర'ను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సుధీర్ బాబు హీరో కాగా సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న జటాధర చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకుంటోంది. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్) -
హోలీ వేడుకల్లో సోనాక్షి సిన్హా.. ఆయన ఎక్కడంటూ నెటిజన్ల ట్రోల్స్!
సినీ తారలంతా హోలీ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి రంగులు చల్లుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. అందరిలాగే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సైతం హోలీ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోనాక్షిని ట్రోల్ చేశారు. హోలీ వేడుకల్లో మీ భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌కు సోనాక్షి కూడా స్పందించింది. 'నేను ప్రస్తుతం జటాధర మూవీ షూట్లో ఉన్నా.. నా భర్త జహీర్ ముంబయిలో ఉన్నారు.. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి' అంటూ విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది.కాగా.. గతేడాది జూన్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి, జహీర్ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. సల్మాన్‌ఖాన్ నిర్వహించిన పార్టీలో తొలిసారిగా వీరిద్దరు కలుసుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 'నోట్‌బుక్'తో అరంగేట్రం చేసిన జహీర్.. సోనాక్షితో కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. గతేడాది జూన్ 23, 2024న ముంబయిలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్, కాజోల్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు హాజరయ్యారు.ఇక సినిమాల విషయానికొస్తే సోనాక్షి సిన్హా ప్రస్తుతం జటాధార చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
హరోం హర అంటున్న సినీ స్టార్స్
మహా శివరాత్రి పర్వదినం (ఫిబ్రవరి 26) సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహా శివరాత్రికి జాగరణ చేసేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తుతారు. ఆ రోజు శివాలయాలన్నీ హరోం హర అంటూ శివనామ స్మరణతో మార్మోగుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా మహా శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. శివుడి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. తాజాగా పరమేశ్వరుడి నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే శివ భక్తి నేపథ్యంలో పాటలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాల గురించి తెలుసుకుందాం.శివుడి నేపథ్యంలో...తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఆహార దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో పోస్టర్లో ఉంది.అంటే... ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని కచ్చితంగా ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందని చెప్పకనే చెప్పింది యూనిట్. ఈ సినిమాలో మురికి వాడల్లో నివశించే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉంటుంది. అలాగే ముంబైకి చెందిన ఓ ధనవంతుడి పాత్రలో నాగార్జున కనిపించనుండగా, రష్మికా మందన్న మధ్యతరగతి యువతి పాత్ర చేస్తున్నారు. నటుడు జిమ్ సర్భ్ ఓ బిలియనీర్ బిజినెస్ మ్యాన్‌గా కనిపిస్తారు. శివ భక్తుడి కథమంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ‘కన్నప్ప’ యూనిట్. పరమశివుడికి వీర భక్తుడైన కన్నప్ప నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కన్నప్పలోని వీరత్వం, భక్తిని మేళవించి ఈ మూవీ తెరకెక్కించారు ముఖేశ్ కుమార్ సింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయడం విశేషం. శివ తాండవం చేస్తున్న అక్షయ్ కుమార్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.శివుడిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో ఆ పోస్టర్ ద్వారా చూపించింది యూనిట్. అంతేకాదు... ఈ సినిమా నుంచి విడుదలైన ‘శివ శివ శంకరా...’ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేశారు. ఈ మూవీలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మధుబాల, ప్రీతీ ముకుందన్, ఐశ్వర్య, దేవరాజ్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. శివ తాండవం పాప వినాశక సాక్షాత్ సాంబ శివ అంటూ ఆడి పాడుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై కథానాయికలు. పెన్ స్టూడియోస్‌పై డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో శివుడి నేపథ్యంలో ఓ పాట తెరకెక్కించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘భైరవం’ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ పాటలో పరమ శివుని భయం, బలం ఈ రెండింటినీ తన హావభావాలు, నృత్యంతో అద్భుతంగా కనబరిచారు సాయి శ్రీనివాస్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు.‘‘ఈ నెల 26న రానున్న మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక పాటని విడుదల చేశాం. పరమ శివుడి దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్‌ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. సాయి శ్రీనివాస్ పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. జటాధరవైవిధ్యమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్‌బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ భన్సల్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర వీటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పరమ శివుడితో ముడిపడిన కథే అని సమాచారం. పైగా టైటిల్‌ని బట్టి చూస్తే ఇదే వాస్తవం అనిపిస్తుంది. జటాధరుడు అని పరమ శివుణ్ణి పిలుస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.పరమ శివుని భక్తురాలుహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ తేజ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు.సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో శివ భక్తురాలైన శివ శక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ సింహ భాగం వారణాసిలోని కాశీలో జరిగింది. శనివారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇవే కాదు... మరికొన్ని సినిమాలు కూడా శివుడి నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. -
అనంత నిధి కోసం సుధీర్ బాబు ‘జటాధర’.. రంగంలోకి జీ స్టూడియోస్
సుధీర్ బాబు మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన తాజాగా నటిస్తోన్న సినిమా ‘జటాధర’. రుస్తుం తరువాత మళ్లీ ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. సూపన్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జటాధర చిత్రంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చింది.ఈ మేరకు జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్‌లో మేం ఇంకా ఎన్నో కథలను అందించాలని, అవి తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నాం. జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది. అందుకే ప్రస్తుతం సుధీర్ బాబు తన బాడీని పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత మరిన్ని అప్డేట్స్ అందించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. మొత్తం మీద, జటాధర సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులకు, అలాగే పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ క్రియేట్ చేయబోతోంది.


