తెలుగులో ఈ వీకెండ్ చాలా సినిమాలు రిలీజయ్యాయి. రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్'తో పాటు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా చిత్రాలతో పాటు ఆర్యన్, డీయస్ ఈరే లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. వీటితోనే రిలీజైన సుధీర్ బాబు 'జటాధర'కు మాత్రం తొలి షో నుంచే తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం షాకింగ్ అనిపిస్తున్నాయి.
ఈ వారాంతం రిలీజైన సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ చిత్రాలు ఉన్నంతలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. జనాలు థియేటర్లకు వస్తున్నారు గానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదా అనిపిస్తుంది. ఎందుకంటే మేకర్స్ వైపు నుంచి ఎలాంటి పోస్టర్స్ బయటకు రాలేదు. మరోవైపు తెలుగు-హిందీలో రిలీజైన 'జటాధర' టీమ్ మాత్రం కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..)
తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ సాధించగా.. రెండు రోజులకు కలిపి రూ.2.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. పాజిటివ్ టాక్ ఏ మాత్రం రాని 'జటాధర'కు ఈ రేంజు వసూళ్లు రావడం అంటే ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు. వీకెండ్ పూర్తయ్యేసరికి మరి ఏ మూవీ రేసులో ముందు ఉంటుందో చూడాలి?
'జటాధర' విషయానికొస్తే.. రుద్రారం అనే ఊరిలోని ఓ ఇంట్లో దాచిన లంకె బిందెలకు ఓ ధన పిశాచి (సోనాక్షి సిన్హా) కాపలా ఉంటుంది. ఓసారి బంధనానికి విఘాతం కలిగి ధనపిశాచి రక్తాన్ని మరుగుతుంది. దీంతో ఊరంతా ఖాళీ అయిపోతుంది.. మరోవైపు శివ(సుధీర్ బాబు) అనే ఘోస్ట్ హంటర్.. సైంటిఫిక్‌గా దెయ్యాలు లేవని నిరూపిస్తూ ఉంటాడు. శివకు తరుచుగా ఓ బాబుని అతడి తల్లి చంపుతున్నట్లు పీడకల వస్తూ ఉంటుంది. ఈ పీడకలకు, ధనపిశాచికి, శివకు మధ్య సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 20 ఏళ్ల యువతిపై 'అనుపమ పరమేశ్వరన్' ఫిర్యాదు)


