జటాధరలో సితార | Divya Khosla look from Jatadhara released | Sakshi
Sakshi News home page

జటాధరలో సితార

Aug 24 2025 4:25 AM | Updated on Aug 24 2025 4:25 AM

Divya Khosla look from Jatadhara released

సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్‌ కల్యాణ్, అభిషేక్‌ జైస్వాల్‌ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా మరో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కీలకమైన సితారపాత్రలో దివ్య ఖోస్లా నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

జీ స్టూడియోస్‌ సమర్పణలో ఉమేష్‌ కుమార్‌ బన్సల్, ప్రేరణా అరోరా సహకారంతో శివిన్‌ నారంగ్, నిఖిల్‌ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్షయ్‌ కేజ్రీవాల్, కుస్సుం అరోరా ఈ సినిమాకు సహ–నిర్మాతలు. ఈ చిత్రంపాన్‌ ఇండియా స్థాయిలో థియేటర్స్‌లో విడుదలకానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement