
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ 'జటాధర'. ఈ మూవీని డివోషనల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా..ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సోనాక్షి సిన్హా విలన్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె శోభ అనే పాత్రలో మెప్పించనుంది. తాజా పోస్టర్ చూస్తుంటే ఫుల్ అగ్రెసివ్ రోల్ చేస్తునట్లు అర్థమవుతోంది. శిల్పా శిరోద్కర్ ఇటీవలే హిందీ బిగ్‌బాస్‌లో అలరించిన సంగతి తెలిసిందే.
తన పాత్ర శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ.. 'జటాధారలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రేక్షకులను అతీంద్రియ ప్రయాణంలోకి తీసుకెళ్లే చిత్రం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కథ కూడా చాలా ప్రభావం చూపుతుంది. ప్రేరణ అరోరాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. శోభ పాత్రను పోషించడం సవాల్తో కూడుకున్న పని. ఈ పాత్రను మనసు పెట్టి చేశా. ప్రత్యేకమైన పాత్ర పోషించడం అద్భుతంగా అనిపిస్తోంది. తెరపై నన్ను నేను చూసుకునేందుకు ఆసక్తిగా ఉన్నా' అని పంచుకుంది.
కాగా.. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ సిస్టర్ అయిన శిల్పా శిరోద్కర్ చాలా కాలం నుంచి సినిమాలకు విరామం తీసుకుంది. ప్రస్తుతం దుబాయిలో సెటిల్ అయినా ఆమె ఈ సినిమా పాత్ర నచ్చడంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, ప్రేరణా అరోరా సహకారంతో శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్ నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుం అరోరా ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్‌లో విడుదలకానుంది.
#ShilpaShirodkar stuns as Shobha in #Jatadhara – power, intensity & mysticism all in one frame!✨ @Shilpashirodkr @ZeeStudios_ @isudheerbabu @SonakshiSinha #shilpashirodkar #sonakshisinha #Sudheerbabu #zeestudios #JATADHARA pic.twitter.com/DwCTt4QsHL
— GOODTIMES (@mygoodtimes) August 28, 2025