
సుధీర్ ఆనంద్ (‘సుడిగాలి’ సుధీర్) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైలెస్సో’. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రసన్నకుమార్ కోట దర్శకత్వంలో శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను విడుదల చేశారు. శివాజీ, అక్షర గౌడ, మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్.