
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా. ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 17 థియేటర్లలోకి రానుంది.
అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లకు హాజరైన రాశి ఖన్నా ఓ బూతు పదాన్ని మాట్లాడింది. ఆమె మాట్లాడిన ఆ పదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. మూవీ ప్రచారంలో భాగంగా పిచ్చి ము..ని కాదంటూ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ రాశీ ఖన్నా దీనిపై క్లారిటీ ఇచ్చింది. అది బూతు పదమని తనకు తెలియదని చెప్పుకొచ్చింది. అదొక క్యూట్ వర్డ్ అనుకున్నానని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత దీనిపై హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆ పదాన్ని బామ్మ క్యారెక్టర్‌కు వాడినట్లు వివరించారు. రాశీని బామ్మ అలానే పిలుస్తుందని అన్నారు. అది క్యూట్ వర్డ్ అనుకొని మాట్లాడేశానని రాశీ ఖన్నా తెలిపింది. కానీ ఆ తర్వాత అది బూతు పదమని తెలిసిందని వెల్లడించింది. ప్రస్తుతం రాశీ ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
I'm not laughing like a pichi munda.
:- #RaashiKhannapic.twitter.com/yBHxJGldHs— Milagro Movies (@MilagroMovies) October 11, 2025
"నాకు అది బూతు అని తెలియదు..
I thought it was a Cute Word."
– #RaashiiKhanna | #TelusuKada pic.twitter.com/vdwYblQgqy— Whynot Cinemas (@whynotcinemass_) October 13, 2025