
సుధీర్‌బాబు, సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. దర్శక ద్వయం వెంకట్ కల్యాణ్– అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నవంబరు 7న విడుదల చేయనున్నట్లు సోమవారం అధికారికంగా వెల్లడించారు మేకర్స్. ‘‘ఒక ఫోక్ టేల్ నుంచి పుట్టిన అద్భుతమైన కథే ‘జటాధర’. స్టోరీ టెల్లింగ్, సినిమా స్కేల్, విజన్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఓ సరికొత్త లోకంలోకి తీసుకువెళుతుంది.. అలాగే గొప్ప అనుభూతిని ఇస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.