
యంగ్ నటుడు సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇదివరకే లుక్స్ రిలీజ్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. స్టోరీ ఏంటనేది చూచాయిగా క్లారిటీ ఇచ్చారు. సోనాక్షి ఇందులో విలన్ తరహా పాత్రలో కనిపించనుంది.
(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)
బంగారు ఆభరణాలతో సోనాక్షి పాత్ర కనిపిస్తుండగా.. సాధారణ మనిషిగా ఉండే హీరో సోనాక్షితో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటనేదే సినిమా స్టోరీలా అనిపిస్తుంది. వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో త్వరలో థియేటర్లలోకి తీసుకురానున్నారు.
(ఇదీ చదవండి: రెండు జడలతో నాని ఫస్ట్ లుక్.. ఫుల్ క్రేజీ)