
సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న నాని.. ఇప్పుడు మరోసారి క్రేజీ పాత్రతో రాబోతున్నాడు. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం నాని 'ద ప్యారడైజ్' మూవీ చేస్తున్నాడు. ఇదివరకే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజైంది. కాకపోతే నాని ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు పూర్తిగా ముఖాన్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలానే పాత్ర పేరుని కూడా బయటపెట్టారు.
(ఇదీ చదవండి: లేడీ యాంకర్ చేతబడి.. వాళ్లను చెప్పు తీసుకుని కొట్టాలి: యాంకర్ రవి)
ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ప్యారడైజ్'లో నాని.. రెండు జడలతో కనిపించబోతున్నాడు. ఈ పాత్రకు జడల్ అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వారం పది రోజుల క్రితమే దీన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలనుకున్నారు. కానీ 'కింగ్డమ్' రిలీజ్, తర్వాత సినీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు షేర్ చేశారు.
ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్ అని రూమర్స్ వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలానే హిందీ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ కాగా.. మోహన్ బాబు, బాబు మోహన్ ప్రతినాయక పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే గ్లింప్స్ కోసం ఇచ్చిన మ్యూజిక్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ఏడాది మార్చి 26న మూవీ పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ప్రముఖ నటి 'హుమా ఖురేషి' సోదరుడు హత్య)
His Name/వాడి పేరు
‘Jadal’
‘జడల్’
Calling a spade a spade. #THEPARADISE @odela_srikanth @anirudhofficial @SLVCinemasOffl @Dop_Sai @NavinNooli @artkolla @kabilanchelliah pic.twitter.com/gN3i0fPxv7— Nani (@NameisNani) August 8, 2025