హారర్ సినిమాలు తీయాలంటే హాలీవుడ్ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. చూస్తున్నప్పుడు భయపెడతాయి. ఈ ఏడాది అలా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని భయపెట్టిన ఓ సినిమా ఓటీటీలో ఉచితంగా అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?)
ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన హాలీవుడ్ మూవీ 'వెపన్స్'. రూ.335 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.2400 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. విడుదల తర్వాత కొన్ని వారాలకే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లేలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఎక్కువమంది చూడలేకపోయారు. ఇప్పుడు కొత్తగా హాట్‌స్టార్‌లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 8 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
'వెపన్స్' విషయానికొస్తే.. మేబ్రూక్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి 2:17 గంటలకు 17 మంది చిన్నారులు వాళ్ల ఇంట్లో నుంచి బయటకెళ్లిపోతారు. ఎంత వెతికినా కనిపించరు. వీళ్లంతా ఒకే స్కూల్ ఒకే క్లాస్‌లో చదువుతుంటారు. ఇదే క్లాస్‌కి చెందిన ఓ పిల్లాడు మాత్రం బాగానే ఉంటాడు. దీంతో ఊరందరి అనుమానం క్లాస్ టీచర్ జస్టిన్(జూలియా గార్నర్)పై పడుతుంది. అసలు ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర)
At 2:17 a.m., seventeen children disappeared from their homes and never came back.
Where did they go?#Weapons, streaming January 8 onwards on JioHotstar. pic.twitter.com/46m9ewEc06— JioHotstar (@JioHotstar) December 23, 2025


