ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. ఒకసారి వేరే హీరో అనుకున్న తర్వాత లేదు లేదు మళ్లీ పాత హీరోతోనే మూవీ చేయడం లాంటివి మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో అదే జరగనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తద్వారా అల్లు అర్జున్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?
అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ పడ్డాయి. అలా వీళ్లిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని ఏడాది-ఏడాదిన్నర క్రితం తెగ మాట్లాడుకున్నారు. అదో భారీ మైథలాజికల్ సబ్జెక్ట్ అనే టాక్ బయటకొచ్చింది. లెక్క ప్రకారం 'పుష్ప 2' తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో ఈ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తారక్‌తో ఈ ప్రాజెక్ట్ చేస్తారని న్యూస్ బయటకొచ్చింది.
(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)
ఇందుకు తగ్గట్లే ఎన్టీఆర్ కూడా 'ద గాడ్ ఆఫ్ వార్' పుస్తకం పట్టుకుని ఒకటి రెండుసార్లు కనిపించాడు. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ ఎత్తున ఈ సినిమా ఉండబోతుందన్నట్లు పరోక్షంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. కొన్ని సందర్భాల్లో సినిమాలు చేతులు మారుతుంటాయని అన్నాడు. ఇది బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమేనని నెటిజన్ల అంటున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు. అట్లీది వేసవికల్లా పూర్తవుతుంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తోనూ బన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో బన్నీతో చేసేవారిలో ఎవరు ముందు ఎవరు వెనక అనేది చూడాలి? పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్.. మరోసారి తారక్‌కి హ్యాండ్ ఇచ్చాడా అనిపిస్తుంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మూవీ ప్రకటించారు. కానీ దాన్ని పట్టాలెక్కించలేకపోయారు.
(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర)


