
యాంకర్ రవి (Anchor Ravi).. ఫుల్ క్రేజ్ ఉన్న యాంకర్. టాలెంట్ పుష్కలంగా ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటాడు. బిగ్‌బాస్‌కు వెళ్లి విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. తాజాగా బిగ్‌బాస్ జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. యాంకర్ రవి మాట్లాడుతూ.. ఎక్కడైతే మనిషిని పుట్టుమచ్చలతో సహా చూస్తారో.. ఇక వాళ్లు సెలబ్రిటీలు కారు. పెద్ద పెద్ద హీరోలు సినిమా రిలీజ్‌కు ఐదు రోజుల ముందు కనిపిస్తారంతే.. తర్వాత వాళ్లు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారన్నది తెలియదు. అదే స్టార్‌డమ్‌ను నిర్ణయిస్తుంది. మరీ రెగ్యులర్‌గా కనిపిస్తే చులకనైపోతాం.
బిగ్‌బాస్‌లో అందరూ నటిస్తారు
అందుకే బిగ్‌బాస్‌కు వెళ్లాలనుకోలేదు. నాలుగు సీజన్ల నుంచి పిలుపొచ్చినా రిజెక్ట్ చేశాను. ఐదో సీజన్‌కు అడిగినప్పుడు.. ఫలానా మొత్తం ఇస్తేనే బిగ్‌బాస్‌కు వస్తానని తప్పించుకోవాలని చూశాను. కానీ, వాళ్లు అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఓకే చెప్పక తప్పలేదు. కానీ ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కున్నాను. అయితే బిగ్‌బాస్ వల్ల మనం సంపాదించుకున్న పేరంతా కుప్పకూలిపోతుంది. ఆ షోకి వెళ్లిన ఎవరైనా నటించాల్సిందే! ఎవరైనా బిగ్‌బాస్‌కు వెళ్లిన వాళ్లు నేను నటించలేదు, రియల్‌గా ఉన్నాను అని చెప్తే చెప్పు తీసుకుని కొట్టాలి.
చేతబడి
మన చుట్టూ కెమెరాలున్నాయంటే కచ్చితంగా నటిస్తారు. ఆ షోకి ఒక డైరెక్టర్, పది మంది రచయితలుంటారు అని చెప్పుకొచ్చాడు. అలాగే తనపై ఓ లేడీ యాంకర్ పూజలు చేయించిందని తెలిపాడు. నా బ్యాచ్‌లో ఒక యాంకర్ నాపై చేతబడి లాంటి పూజలు చేయించింది. అలా చేస్తే వాళ్లకేం మజా వచ్చిందో మరి! ఇవన్నీ నేను నమ్మను.. కానీ.. ఇలా చాలామంది మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ యాంకర్ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.