
మహేశ్‌బాబు (Mahesh Babu) కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో మురారి (Murari Movie) ఒకటి. ఈ చిత్రంతోనే బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రె తెలుగు తెరకు పరిచయమైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. 2001లో రిలీజైన ఈ చిత్రం గతేడాది మహేశ్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి థియేటర్లలో విడుదలై సందడి చేసింది. రీరిలీజ్ సినిమా అయినప్పటికీ ఏకంగా రూ.9 కోట్లపైనే వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది.

ఫస్ట్ రియాక్షన్ ఇదే!
ఈ మూవీలో మహేశ్ నటన, పాటలు అన్నీ అద్భుతంగా కుదిరాయి. తాజాగా ఓ వ్యక్తి మురారి సినిమాలోని 'చందమామ చందమామ కిందికి చూడమ్మా..' సాంగ్ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సినిమా కథ చెప్పినప్పుడు మహేశ్ రియాక్షన్ ఏంటి సర్? అని కృష్ణవంశీని అడిగాడు. అందుకు దర్శకుడు స్పందిస్తూ.. ఆయనకు నచ్చలేదు అని నవ్వుతున్న ఎమోజీలతో ఎక్స్ (ట్విటర్)లో రిప్లై ఇచ్చాడు.
నెక్స్ట్ ఏం జరిగింది?
ఇది చూసిన నెటిజన్లు.. తర్వాత ఏం జరిగింది సర్? ఆయన్ను ఎలా ఒప్పించారు? అసలేం జరిగిందో పూర్తిగా చెప్పొచ్చుగా అని ఆరా తీస్తున్నారు. మరికొందరేమో.. ఏముంది? మహేశ్ తండ్రి కృష్ణగారి దగ్గరకు వెళ్తే ఆయన కృష్ణవంశీకి కథపై ఉన్న నమ్మకం చూసి సినిమా చేయమని ఆదేశించినట్లున్నారు. మహేశ్ సరేనని తలాడించడంతో మురారి సినిమా పట్టాలెక్కింది అని ఊహిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
He hated it 😀😀😀 https://t.co/s8lKwHOWWa
— Krishna Vamsi (@director_kv) August 7, 2025
చదవండి: కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు