టాలీవుడ్ నటి అనసూయ మరో పోస్ట్ చేసింది. ఇప్పటికే శివాజీ కామెంట్స్కు కౌంటరిచ్చిన అనసూయ తాజాగా ట్వీట్ చేసింది. ఇది కేవలం మహిళల గురించి మాత్రమే కాదని తెలిపింది. పాత తరాలు నేర్చుకున్నవి, అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొంతమంది పురుషులు, మహిళలు కూడా నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.
అనసూయ తన ట్వీట్లో రాస్తూ..' కొంతమంది పురుషులు, మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని' తెలిపింది.
ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని తెలిపింది. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదని హితవు పలికింది. అంతేకాకుండా కొంతమంది మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన మహిమాపరచడం (గ్లోరిఫికేషన్) సమంజసం కాదని ట్వీట్లో రాసుకొచ్చింది.
I need to say this..
కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ…— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025


