టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం 'జటాధర'(JATADHARA Release Trailer). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఈ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి అనే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్‌తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్ కట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.
ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది.


