సుధాకర్, డింపుల్ హయతి, ఆషిక, కిశోర్ తిరుమల
‘‘రవితేజగారితో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ చేయాలనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ రాశాను. చక్కని వినోదంతోపాటు అద్భుతమైన సంగీతంతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మన జీవితం తెరపై చూసుకున్నట్టుగా ఈ సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్ కిశోర్ తిరుమల తెలిపారు. రవితేజ హీరోగా, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘రవితేజగారి మార్క్ ఫన్ మిస్ అవ్వకుండా నా శైలిలో ఈ సినిమాని చాలా వినోదాత్మకంగా చేశాను. ఈ చిత్రంలో ఆయన పోషించిన రామ సత్యనారాయణపాత్ర ఫ్రెష్‌గా ఉంటుంది’’ అన్నారు. సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో ఉంటుంది.
ఈ సంక్రాంతికి మాతోపాటు వస్తున్న ఇతర చిత్రాలు కూడా బాగా ఆడాలి... కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి... అలాగే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు. ‘‘ఈ చిత్రంలో నాపాత్ర పేరు బాలామణి. ఇది నా ఫస్ట్ సంక్రాంతి సినిమా కాబట్టి చాలా ప్రత్యేకం’’ అన్నారు డింపుల్ హయతి. ‘‘ఈ మూవీలో మోడ్రన్, కాన్ఫిడెంట్, బోల్డ్‌గా ఉండే మానసా శెట్టిపాత్రలో కనిపిస్తాను’’ అని ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు.


