
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జటాధర. ఈ మూవీలో పాన్ ఇండియా మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో పాటను విడుదల చేశారు.
జటాధర మూవీలోని ధన పిశాచి అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా..సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటకు సమీర్ కొప్పికర్ సంగీతమందించారు. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. సోనాక్షి సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది.