
‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా... ట్రెండ్ సెట్ చెయ్...’ అంటూ సుధీర్‌బాబుతో ఆడి పాడుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రేయా శర్మ. సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ కీలక పాత్రలు ΄ోషించారు.
జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న రిలీజ్ కానుంది. రాయిస్, జైన్, సామ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ట్రెండ్ సెట్ చెయ్...’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని బుధవారం విడుదల చేశారు. పబ్ నేపథ్యంలో సాగే ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించగా, స్ఫూర్తి జితేందర్, రాజీవ్ రాజ్ పాడారు. జీతూ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జటాధర’’ అని చిత్రబృందం పేర్కొంది.