
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) నటుడు మాత్రమే కాదు, తనలో మరో కళ కూడా ఉంది. అదే పెయింటింగ్ కళ! తాజాగా అతడు తన చేతులతో ఓ అద్భుతాన్ని సృష్టించాడు. నీలకంఠుడి పెయింటింగ్ వేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. నేను ఎవరి పెయింటింగ్ వేస్తున్నాననుకుంటున్నారు? ఎవరైనా అందమైన అమ్మాయిల బొమ్మలు గీస్తుంటారు.
అందగాడి బొమ్మ గీస్తున్నా..
కానీ నేను ఒక అందగాడి బొమ్మను గీస్తున్నా.. ఆయన ఎలాంటి అందగాడంటే అందాన్ని చందమామతో పోలుస్తాం కదా.. ఆ చందమామ ఆయన తలలో ఏదో ఒక మూలన పడి ఉంటుంది. అసలాయన అందం ముందు చందమామను ఎవరూ పట్టించుకోరు. మనమంతా అందంగా కనిపించడానికి మంచిగా హెయిర్‌స్టైల్ చేసుకుంటే ఆయనేమో జుట్టునసలు పట్టించుకోనే పట్టించుకోడు. అందుకే ఆయన జుట్టు ఎప్పుడూ ఏదో దారాలు చిక్కుక్కున్నట్లు చిక్కుముడుల్లా ఉంటుంది.
ఆ బొమ్మే జటాధర
అందుకే ఆయన్ని జటాధర అని పిలుస్తారు. ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలి. అందుకోసం నేనో బొమ్మ (సినిమా) తీశాను.. ఆ బొమ్మే జటాధర. అందరూ థియేటర్లలో జటాధర చూడండి అని చెప్పుకొచ్చాడు. జటాధర విషయానికి వస్తే.. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని దర్శక ద్వయం వెంకట్ కల్యాణ్– అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించారు. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.
చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై సంజనా చీప్ కామెంట్స్