గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై సంజనా చీప్‌ కామెంట్స్‌ | Bigg Boss Telugu 9: Sanjana Sparks Controversy with Suman Comment | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 9: గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై నోరు జారిన సంజనా

Sep 20 2025 12:45 PM | Updated on Sep 20 2025 1:00 PM

Bigg Boss 9 Telugu: Sanjana Galrani Cheap Comments on Suman Shetty

ఒక్కసారి నోరు జారితే ఆ మాటను తిరిగి తీసుకోలేం. ఆ విషయం తెలిసి కూడా చాలామంది అదేపనిగా నోరు జారుతూ ఉంటారు. తీరా తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకుంటారు. బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌లో అదే జరిగింది. నిన్న బిగ్‌బాస్‌ టెనెంట్లకు ఓనర్లయ్యే అవకాశం కల్పించాడు. ఒక్కో రౌండ్‌లో ఎలిమినేట్‌ అయినవారు మిగతావారిలో ఎవరికైనా సపోర్ట్‌ చేయొచ్చన్నాడు.

గాజులేసుకుని కూర్చోండి
దాంతో సంజనా, ఫ్లోరా.. ఫస్ట్‌ సుమన్‌ను టార్గెట్‌ చేసి అతడు ఎలిమినేట్‌ అయ్యేలా చేశారు. అయితే సుమన్‌ (Suman Shetty) కాసేపు ఆడకుండా సోఫాలో కూర్చున్నందుకు అతడిపై సెటైర్లు వేసింది. మీరు మమ్మల్ని చెడ్డోళ్లను చేసి మీరు గాజులేసుకుని కూర్చోండి అని సుమన్‌పై ఫైర్‌ అయింది. అందుకతడు మీరెప్పుడో చెడ్డోళ్లయ్యారు అని కౌంటర్‌ ఇచ్చింది. 

సంజనాకు వార్నింగ్‌
ఇక అక్కడే ఉన్న శ్రీజ.. అలాంటి మాటలు మాట్లాడొద్దంటూ సంజనాకు వార్నింగ్‌ ఇచ్చింది. సంజనా కామెంట్స్‌పై నెట్టింట ట్రోలింగ్‌ జరుగుతోంది. మాస్క్‌ మ్యాన్‌ హరీశ్‌.. ఆడవాళ్లను చాలా చులకన చేసి మాట్లాడాడంటూ గతవారం నాగార్జునతోనే వాదించింది సంజనా. మరిప్పుడు తనే స్వయంగా.. సుమన్‌ను గాజులేసుకుని కూర్చోండి అనడంలో అర్థమేంటి? అంటే, ఆడవారికి ఏదీ చేతకాదు, ఓ మూలన కూర్చోమనా? ఈ కామెంట్స్‌తో ఆమె స్త్రీలను అవమానించట్లే అవుతుంది కదా! 

క్షమాపణలు కోరిన సంజనా
ఆవేశంలో నోటికి ఎంతొస్తే అంత వాగుతారా? అని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇకపోతే గేమ్‌ అయ్యాక తన తప్పు తెలుసుకున్న సంజనా.. సుమన్‌కు సారీ చెప్పింది. నీ చెల్లి అనుకుని క్షమించమని కోరింది. దీంతో అతడు కూడా ఆమె సారీని యాక్సెప్ట్‌ చేశాడు. మరి నాగార్జున ఈ విషయాన్ని ప్రస్తావించి సంజనాకు క్లాస్‌ పీకుతాడో? లేదో? చూడాలి!

 

 

చదవండి: నాకు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉండగా మా అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉంటే తప్పేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement