
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో సెలబ్రిటీలు అడుగుపెట్టినప్పుడు వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ లాగుతుంటారు. కొన్నిసార్లు వాళ్లే గతాన్ని గుర్తు చేసుకుని పక్కవారితో చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునిక సదానంద్ అదే పని చేసింది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్‌లో పాల్గొంది.
నాకింకా పెళ్లి కాలే
ఈమె కెరీర్ తొలినాళ్లలో సింగర్ కుమార్ సానును ప్రేమించింది. ఈ విషయాన్ని ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించింది. నేను సింగర్ (కుమార్ సాను)ని ప్రేమించాను. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. అతడు భార్యతో విడిపోయి ఉంటున్నాడు. దీంతో మేమిద్దరం కలిసుండేవాళ్లం. తనను ఎంతగానో నమ్మాను. కానీ ఓరోజు తనకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసింది.
తప్పేంటి?
ఆ విషయం అతడే ఒప్పుకోవడంతో తనకు బ్రేకప్ చెప్పాను అంది. తల్లికి యుక్తవయసులో ఉన్న రిలేషన్‌షిప్ గురించి కునిక కుమారుడు అయాన్ లాల్ స్పందిస్తూ.. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? అప్పుడు తన వయసు 27 ఏళ్లే కదా! అప్పుడు నేనింకా పుట్టనేలేదు. కానీ, అమ్మ ప్రేమ విషయం నాకు తర్వాత తెలిసింది.
27 ఏళ్ల వయసులో లవ్
అమ్మ అతడిని (కుమార్ సాను) సింగర్‌గా ఇష్టపడేది. ఇంట్లో అతడి పాటలు పాడుతూ ఉండేది. ఇప్పటికీ పాడుతుంది కూడా! అతడి ప్రతిభను ఇష్టపడుతుంది, కానీ ఆ వ్యక్తిని కాదు. వాళ్ల ప్రేమాయణం 27 ఏళ్లు సాగిందని అందరూ అనుకుంటారు, అది నిజం కాదు! అమ్మ 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమలో పడిందంతే! కొన్నేళ్లకే విడిపోయారు అని చెప్పుకొచ్చాడు.
రెండు పెళ్లిళ్లు- విడాకులు
కునికకు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కొడుకు పుట్టాడు. తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఓ కుమారుడు సంతానం. కానీ ఈ జంట కూడా ఎంతోకాలం కలిసుండలేదు, భేదాభిప్రాయాల వల్ల విడాకులు తీసుకున్నారు.
చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్‌గా రాము రాథోడ్