
బిగ్‌బాస్ హౌస్‌లో బండచాకిరీ చేస్తున్న టెనెంట్స్‌లో ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందుకోసం ఓ గేమ్ పెట్టాడు. ఓనర్లు విసిరే బంతులు, బొమ్మలను టెనెంట్లు క్యాచ్ చేసి వారి బాస్కెట్‌లో వేసుకోవాలి. ఎండ్ బజర్ వచ్చేవరకు ఆ బాస్కెట్‌లోని వస్తువులను ఎవరూ ఎత్తుకుపోకుండా భద్రంగా దాచుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువ వస్తువులుంటే వారు ఎలిమినేట్ అవుతూ వస్తారు.
గివప్ ఇచ్చేసిన సంజనా
మొదటి రౌండ్‌లో ఫ్లోరా, సంజనా బాగానే ఆడారు. కానీ ఫ్లోరా ఓడిపోయింది. అటు సంజన కూడా.. ఆల్‌రెడీ ఓ వారం కెప్టెన్‌గా ఇంట్లో ఉన్నాను కాబట్టి వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొంటూ గేమ్ నుంచి నిష్క్రమించింది. అయితే వీరిద్దరూ టెనెంట్స్‌లో ఎవరిని ఓనర్స్‌గా చూడాలనుకుంటున్నారో వారికి సపోర్ట్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).
ఈడ్చిపడేసిన సుమన్
దీంతో ఇద్దరూ కలిసి రెండో రౌండ్‌లో సుమన్ దగ్గరున్న బొమ్మలు తీయబోయారు. వారిని వదిలించుకునే క్రమంలో సుమన్ (Suman Shetty) మోచేయి ఫ్లోరాకి తగిలింది. డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలి వారికి దెబ్బలు తగిలినా సరే సంచాలక్ ప్రియ.. అతడిని ఎలిమినేట్ చేసింది. కానీ తర్వాతి రౌండ్‌లో రీతూ డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలివారిని కొట్టినా ప్రియ ఆమెను ఎలిమినేట్ చేయకపోవడం గమనార్హం.

రీతూ రిక్వెస్ట్ పట్టించుకోని సుమన్
రీతూ నన్ను కొట్టినప్పుడు ఎందుకు ఔట్ చేయలేదు? మీ ఫ్రెండ్ అని వదిలేశారా? అని సంజనా నిలదీసినా సరే ప్రియ పట్టించుకోలేదు. ఇక ఫ్లోరా, సంజన, సుమన్.. ముగ్గురూ రీతూ (Rithu Chowdary)నే అటాక్ చేశారు. అన్నా ప్లీజ్ అన్నా, వాళ్లను ఆపు అన్నా.. అని రీతూ.. సుమన్‌ను బతిమాలుకున్నా అతడు పట్టించుకోలేదు. రీతూ బాస్కెట్ ఖాళీ చేసి తనూజ, రాము, ఇమ్మూకి వస్తువులు పంచేశారు. అది జీర్ణించుకోలేని రీతూ పిచ్చిపట్టినట్లుగా ఆడింది. రాము బాస్కెట్‌లో ఉన్న బొమ్మలన్నీ తీసేసుకుంది.
మాట మార్చేసిన రీతూ
ఇక్కడ మరో ముఖ్య విషయమేంటంటే.. చివరి వరకు మనిద్దరమే ఉండాలని రామూతో డీల్ మాట్లాడుకున్న రీతూ.. దాన్ని మర్చిపోయింది. ఆమె మాట తప్పడం చూసి షాకైన రాము.. ఆటాడకుండా శిలలా నిల్చుండిపోయాడు. అది చూసి ఇమ్మూకి పాపం అనిపించడంతో తన బొమ్మలు రాముకిచ్చాడు. అలాగే రీతూ చేసిన పనిని తప్పుపట్టాడు. దీంతో ఆమె.. ముగ్గురు కలిసి నామీద పడితే ఫెయిర్‌గేమా? అని ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ మాటతో తనూజ కూడా రియాక్ట్ అయింది.
నోరు మూయ్
నువ్వు నా దాంట్లో బొమ్మలు తీద్దామని రాముతో చెప్పలేదా? అంటే నీకు గ్రూప్ గేమ్ కావాలి.. వాడికి వద్దా? అని నిలదీసింది. దాంతో రీతూ.. నేను, నీ పేరే చెప్పలేదని బుకాయించింది. ఈ క్రమంలో ఇద్దరూ నువ్వు నోరు మూయ్ అంటూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. సంజనా, ఫ్లోరా, సుమన్ సపోర్ట్ చేస్తామంటే తనూజ, ఇమ్మాన్యుయేల్ మాకు వద్దంటే వద్దని వేడుకున్నారు. సింగిల్‌గానే ఆడతామన్నారు. అలా రీతూ, తనూజ అవుట్ అయ్యాక ఇమ్ము, రాము మిగిలారు.
ఓనర్‌గా రాము
వీరిలో ఒకరిని ఓనర్‌గా ప్రకటించమని టెనెంట్స్‌కు బాధ్యత అప్పగించాడు బిగ్‌బాస్. రీతూ తప్ప అందరూ ఇమ్మాన్యుయేల్‌కే ఓటేశారు. కానీ, రీతూ అస్సలు వినిపించుకోలేదు, రాము ఓనర్ అవ్వాల్సిందేనని బలంగా వాదించింది. దీంతో రామునే ఓనర్‌గా ప్రకటించారు. ఇదంతా అయ్యాక ఇమ్మూ ఎమోషనలయ్యాడు. నేను ఆడలేదా? గ్రూప్ సపోర్ట్ అడిగానా? అంటూ రీతూ మాటల్ని తలుచుకుని బాధపడ్డాడు.