breaking news
Immanuel
-
నేను గుండంకుల్ అంటే.. మీరన్నది ఏంటి?.. మాస్క్ మ్యాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. అప్పుడే హౌస్‌లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు కాస్తా సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ అనగానే ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. అగ్రెసివ్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌లో హౌస్‌లో మాస్క్ మ్యాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనొక్కడే అందరిపై నోరు పారేసుకుంటున్నారని ఆడియన్స్ కూడా భావిస్తున్నారు.అయితే రెండో వారంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్‌ను మిగిలిన కంటెస్టెంట్స్ సైతం ఓ ఆటాడేసుకుంటున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో మాస్క్ మ్యాన్‌కు కమెడియన్ ఇమ్మాన్యూయేల్ గట్టిగానే కౌంటరిచ్చాడు. నామినేషన్స్‌లో భాగంగా హరీశ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గుండంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం ఏంటని హరీశ్‌ను ఇమ్మాన్యుయేల్ నిలదీశాడు. ఇది విన్న మాస్క్ మ్యాన్ నేను మిమ్మల్ని అనలేదంటూ మాట్లాడారు. దీనికి ఇమ్మాన్యూయేల్ సైతం రెచ్చిపోయి ముందుకు దూసుకెళ్లారు. నేను కూడా అన్నది మిమ్మల్ని కాదని..నన్ను నేనే అనుకున్నానని అన్నారు.దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. మీరన్నదానికి ప్రూఫ్ ఉందని ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. లిమిట్స్‌లో ఉండాలంటూ మాస్క్ మ్యాన్ హరీశ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా గట్టిగా కేకలు వేస్తూ ఇమ్మాన్యుయేల్ వైపు దూసుకెళ్లాడు హరీశ్. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హాట్‌హాట్‌గా సాగినట్లు అర్థమవుతోంది. ఇంకేందుకు ఆలస్యం లేటేస్ట్ ప్రోమో చూసేయండి.High voltage nominations! 🔥Real opinions revealed, #SumanShetty breaks his silence! 👁️💣Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/hzGJhuRkjL— JioHotstar Telugu (@JioHotstarTel_) September 16, 2025 -
ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి
మేమే తోపు.. మేము చెప్పిందే కరెక్ట్ అంటూ విర్రవీగిన కామనర్లకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అంతేకాదు, ఎవరూ సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఇంకా బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత మిరాయ్ హీరోహీరోయిన్ తేజ సజ్జ, రితికా స్టేజీపైకి వచ్చారు. ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా డివైడ్ చేయగా వాటికి తేజ, రితిక లీడర్స్‌గా ఉన్నారు. రెచ్చిపోయిన భరణిహౌస్లో వాళ్లు ఓడిపోయినప్పుడల్లా స్టేజీపై వీళ్లతో డ్యాన్స్ చేయించాడు నాగ్ (Nagarjuna Akkineni). అలా గెస్టులుగా వచ్చినవారికి పనిష్మెంట్ ఇచ్చి పంపించాడు. అనంతరం టెనెంట్స్‌లో నుంచి ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందుకోసం సెలబ్రిటీలు రెండు టీములుగా విడిపోయి ఫైట్ చేశారు. రెజ్లింగ్ పోటీలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు. భరణి అయితే దొరికిందే ఛాన్స్.. తన సత్తా ఏంటో చూపిస్తా అన్నట్లుగా రెచ్చిపోయి గేమ్ ఆడాడు.పర్మినెంట్ ఓనర్‌గా భరణిఆడ, మగ తేడా లేకుండా అందర్ని ఈడ్చి అవతల పారేశాడు. ఈ గేమ్‌లో భరణి, తనూజ, రాము రాథోడ్, శ్రష్టి ఉన్న రెడ్ టీమ్ గెలిచింది. వీళ్లలో ఎవరు ఓనర్ అవ్వాలనేది ఓడిన టీమ్ డిసైడ్ చేయాలన్నారు. సంచాలక్ ఫ్లోరా శ్రష్టికి ఓటేసింది. కానీ ఓడిన బ్లూ టీమ్‌లోని ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి అందరూ భరణికి ఓటేశారు. దీంతో అతడు పర్మినెంట్ ఓనర్‌గా మారిపోయాడు. భరణిని ఓనర్‌గా ప్రకటించగానే కామనర్ల ముఖాలు మాడిపోయాయి. మాట మార్చిన ఇమ్మాన్యుయేల్అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బందవుతోంది, తనకు ఛాన్స్ వస్తే అమ్మాయిలను ఓనర్లను చేస్తానన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే శ్రష్టి, తనూజలను కాదని భరణిని ఎంచుకోవడం గమనార్హం. భరణి.. తనూజను పర్సనల్ అసిస్టెంట్‌గా ఎంపిక చేసుకున్నాడు. చివర్లో డిమాన్ పవన్ సేవ్ అవగా శ్రష్టి వర్మ (Shrasti Verma) ఎలిమినేట్ అయింది. వెళ్లిపోయేముందు ఆమె ఓ టాస్క్ ఇచ్చారు. నమ్మకం మీద దెబ్బ కొట్టారుఅందులో భాగంగా జెన్యూన్‌గా ఉండే నలుగురు, కెమెరా ముందు యాక్ట్ చేసే నలుగురి పేర్లు చెప్పమన్నారు. అందుకామె రాము రాథోడ్, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీశ్, ఫ్లోరా సైనీ జెన్యూన్ అంది. రీతూ కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉంటుందని పేర్కొంది. నమ్మకం మీద దెబ్బ కొట్టారు, ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ రాదంటూ తనూజ, భరణి పేర్లు చెప్తూ శ్రష్టి ఎమోషనలైంది. సంజనా పేరు ప్రస్తావించింది.. కానీ తను చాలా స్ట్రాంగ్ అని పేర్కొంది. ఇక వెళ్లిపోయేముందు తను చేసే క్లీనింగ్ టాస్క్.. ఇకపై సుమన్ శెట్టి చేయాలంటూ బిగ్‌బాంబ్ వేసింది.చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..? -
నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కామనర్స్ కామన్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్లను ఓనర్లను చేయగానే నిజమైన ఓనర్లలా తెగ ఫీలైపోతున్నారు. టెనెంట్స్/సెలబ్రిటీలతో కావాల్సినన్ని పనులు చేయించుకుంటూ వారితోనే చీటికిమాటికి గొడవలు పడుతున్నారు. అలా ఈ వారం చాలా గొడవలు జరిగాయి. వాటన్నిటి లెక్కలు సరిచేసేందుకు శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చేశాడు.కామనర్స్‌కు క్లాస్ పీకిన నాగ్సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ మధ్య ఏర్పడిన విభేదాలను క్లియర్ చేశాడు. ఫ్రీ బర్డ్, బ్యాక్ బిచ్చింగ్ అనేవి తప్పు పదాలు కావని క్లారిటీ ఇచ్చాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. చివరకు ఆ తప్పును తనూజ మీదకే నెట్టేసిన కామనర్స్ ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు. అలాగే గుండు అంకుల్ కామెంట్‌పై పెద్ద చర్చే జరిగింది. ఇమ్మాన్యుయేల్ నిన్ను గుండంకుల్ అనడం తప్పే, మరి దానికంటే ముందు రెడ్ ఫ్లవర్ అని నువ్వు అనడం తప్పు కాదా? అని మాస్క్ మ్యాన్ హరీశ్‌ను నిలదీశాడు నాగ్.రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా?అందుకతడు తను దురుద్దేశంతో ఆ మాట అనలేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగైతే గుండంకుల్ కూడా సరదాగా అన్నాడనుకోవచ్చుగా అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్. అగ్నిపరీక్ష కోసం గుండు చేయించుకున్నా.. అలాంటిది నాపై జోక్ వేస్తే తీసుకోను, బార్డర్ క్రాస్ చేస్తే ఊరుకోను అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు హరీశ్. గుండంకుల్ అన్నందుకు ఇమ్మాన్యుయేల్‌తో సారీ చెప్పించుకున్నావ్.. మరి రెడ్ ఫ్లవర్ అన్నందుకు నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదా? అని ప్రశ్నించాడు. వీడియో బయటకు లాగిన నాగ్అప్పటికే ముఖంలో నెత్తురు చుక్క లేని హరీశ్ (Haritha Harish).. సారీ బ్రదర్, అవసరం అయితే ఈ షో నుంచి వెళ్లిపోతా అని అసందర్భంగా మాట్లాడాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా హరీశ్ గురించి ఓ వీడియో ప్లే చేశాడు నాగ్. అందులో హరీశ్.. 'ఇమ్మాన్యుయేల్ ఆడాళ్లతో అయితేనే మాట్లాడతా అన్నాడు. నేను ఇప్పుడు ముగ్గురు ఆడాళ్లతో మాట్లాడా.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి.. ఈ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకిప్పుడు అర్థమైంది' అని మాట్లాడాడు. ఇందులో ఆడాళ్లపై హరీశ్‌కు చిన్నచూపు ఉందని క్లియర్‌గా అర్థమైందని రీతూ తప్ప హౌస్ అంతా ముక్తకంఠంతో చెప్పింది.అడ్డంగా వాదించిన మాస్క్ మ్యాన్కానీ మోనార్క్ హరీశ్ మాత్రం.. ఆడాళ్లను తక్కువ చేయలేదన్నాడు. పైగా.. నాపై ఆరోపణలు చేసి నా క్యారెక్టర్‌ను రాంగ్గా చిత్రీకరిస్తున్నారు అని హౌస్‌మేట్స్‌తో పాటు నాగ్పైనా ఆవేశపడ్డాడు. ఆ మాటతో నాగ్.. ఎవరు రాంగ్ సెట్ చేస్తున్నారు? అని ఫైర్ అయ్యాడు. అక్కడున్న లైవ్ ఆడియన్స్‌ని అడగ్గా వారు కూడా.. హరీశ్ ఫ్లిప్ అవుతున్నాడని చెప్పడంతో మాస్క్ మ్యాన్ దండం పెట్టేశాడు. ఎవరెన్ని చెప్పినా హరీశ్ మాత్రం తలపొగరుతో తను చెప్పిందే కరెక్ట్ అని అడ్డంగా వాదించాడు.చదవండి: ‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్ -
మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్
బిగ్‌బాస్ షోలో ఇప్పటివరకు 8 సీజన్లు జరిగాయి. ప్రతి వీకెండ్లోనూ వచ్చే నాగార్జున.. హౌస్మేట్స్ తప్పొప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్లతో మాట్లాడేవారు. చాలావరకు నాగ్ చెప్పిన దానికి వాళ్ల వైపు నుంచి సానుకూలంగా సమాధానం వచ్చేది. కొన్నిసార్లు మాత్రం హోస్ట్‌తో వాదించేవారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాగార్జున తనని తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తున్నారని మాస్క్ మ్యాన్ సీరియస్ అయిపోయాడు. దీంతో హరీశ్ vs నాగార్జున అన్నట్లు సాగింది.(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్?)శనివారం ఎపిసోడ్‌కి సంబంధించి ఇదివరకు ఓ ప్రోమో రిలీజ్ చేయగా అందులో సంజనకు నాగార్జున కౌంటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేయగా.. ఇమ్మాన్యుయేల్-హరీశ్ గొడవ గురించి మాట్లాడారు. ఇమ్ము.. సరదాకే గుండంకుల్ అని అన్నాడని ఎంతమంది అనుకుంటున్నారని అడగ్గా హౌసులోని అందరూ చేతులెత్తారు. దీంతో మాస్క్ మ్యాన్ హరీశ్‌దే తప్పు అన్నట్లు తేలింది. మరోవైపు ఇతడు.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి గురించి మాట్లాడిన ఓ వీడియోని స్క్రీన్ పై ప్రసారం చేయడంతో కొత్త వివాదం మొదలైంది.ఆ వీడియోలో మాస్క్ మ్యాన్ హరీశ్.. తనూజతో పాటు ఉన్న ఇమ్మాన్యుయేల్, భరణిని ఆడవాళ్లు అని పరోక్షంగా అన్నాడు. అయితే కావాలనే తనని తప్పుగా చూపిస్తున్నారని హరీశ్.. నాగార్జుననే నేరుగా అనేశాడు. నేను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నానా అని ఆశ్చర్యపోవడం నాగ్ వంతైంది. దీంతో ఈ గొడవకు సమాధానం చెప్పలేకపోయిన హరీశ్.. షో నుంచి క్విట్(వెళ్లిపోతా) అయిపోతా అని అన్నట్లు ప్రోమోలో చూపించారు. మరి నిజంగానే మాస్క్ మ్యాన్ని హౌస్ నుంచి బయటకు పంపేస్తారా? లేదంటే ఈ వివాదానికి ఎలా పుల్‌స్టాప్ పెడతారో చూడాలి?(ఇదీ చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?) -
ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ కూడా!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపు ఉంటే, సంజనా ఒక్కరే మరోవైపు నిలబడింది. కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, మరికొన్నిసార్లు అమాయకంగా ముఖం పెడుతుంది. ఒక్కోసారి తనపై నోరుపారేసుకున్నవారిపై ఒంటికాలిపై లేస్తుంది. ఏదేమైనా బిగ్‌బాస్ షోకి కావాల్సిన కంటెంట్ మాత్రం బాగానే ఇస్తుంది. ఇప్పుడేకంగా ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచింది.సత్తా చూపించిన రాముఅయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో కామనర్లు అతి చేశారు. పవన్ కల్యాణ్ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీశ్.. నేను వేరే వాళ్లలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయేల్‌పై సెటైర్లు వేశాడు. ఎవరూ శ్రీజ నిల్చున్న రాడ్స్ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ, ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్! సంజనాకోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజనా కెప్టెన్ అయింది.బాడీ షేమింగ్నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్లు ఎన్ని మాటలంటున్నారు? నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సంజనా.. తన లగేజీకి రూమ్‌లోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకి చెప్తే తను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజనా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్ కోసం బిగ్‌బాస్ చాక్లెట్లు, చిప్స్ పంపిస్తే.. కామనర్లు ప్రియ, శ్రీజ వాటిని కొట్టేశారు. ముగ్గురు ఆడోళ్లుఒక్క గుడ్డు తిన్నందుకు ఆమెను రెండురోజులపాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీశ్.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఒకమ్మాయి, ఇద్దరు మగాళ్లు అనుకున్నా.. కానీ వాళ్లు ముగ్గురు ఆడోళ్లని ఇప్పుడే తెలిసింది. ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు.దొంగతనం చేసిన మాస్క్ మ్యాన్కెప్టెన్ సంజనా హౌస్‌మేట్స్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తనను ఇంప్రెస్ చేస్తే కూల్‌డ్రింక్ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి? అనుకున్నాడో, ఏమో కానీ హరీశ్ ఓ కూల్‌డ్రింక్ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్ చేసేందుకు అందరూ స్కిట్ చేశారు. స్కిట్ చేసిన వాళ్లలో ఫలానా వాళ్లు బెస్ట్ అంటూ ప్రకటించింది. కానీ, అందరికీ కూల్‌డ్రింక్ ఇచ్చేముందు ఓ కూల్‌డ్రింక్ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీశ్ దాన్ని బయటపెడతాడా? లేదా? చూడాలి! -
మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్‌ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్‌బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్‌గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్‌ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లుబిగ్బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్‌గా నిలబడేవారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్‌కు భరణి, సంజనకు శ్రీజ, పవన్‌కు ప్రియ, హరీశ్‌కు పవన్ కల్యాణ్ సపోర్ట్‌గా వచ్చారు.సంచాలక్‌గా మర్యాద మనీష్వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్‌ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్‌కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమ్మాన్యుయేల్‌ను ఎలిమినేట్ చేసిన సంచాలక్శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్‌ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్‌గా ఫెయిల్ఇమ్మూ ఆవేశంతో సంచాలక్‌గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్‌ఫెయిర్ అంటూ అని మనీష్‌ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్‌గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్‌బాస్‌కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్‌లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ -
బిగ్ బాస్ హౌస్ లో మొదలైన రచ్చ.. మొదటిరోజే రెచ్చిపోయిన మాస్క్ మాన్..!
-
గుండంకుల్.. ఎంతమాటన్నాడ్ సార్? అపరిచితుడు బయటకొచ్చేశాడు!
బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu) మొదలైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున అన్నది కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. మొదటి రోజే గొడవపడ్డారు. మాస్క్ మ్యాన్ హరీశ్, కమెడియన్ ఇమ్మాన్యుయేట్ మధ్యే ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం కూడా ఓ రకంగా బిగ్‌బాస్ అనే చెప్పాలి! సెలబ్రిటీలను కామనర్స్గా, కామనర్స్‌ను సెలబ్రిటీలుగా మార్చేశాడు బిగ్‌బాస్. సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక, ప్రధాన హౌస్‌లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు. నోటి కాడ కూడును లాక్కున్నాడు కూడా!ఒక్క పూట అన్నం కోసం..వాళ్లకు వండిపెట్టాలని చెప్పానే తప్ప తినమని ఎవరు చెప్పారన్నట్లుగా సరిగ్గా ప్లేటు ముందు పెట్టుకున్న సమయంలో ఆ ఫుడ్‌ను లోపల పెట్టేయమన్నారు. దీంతో తొమ్మిది మంది సెలబ్రిటీలు చేసేదేం లేక కళ్లతోనే భోజనాన్ని ఆస్వాదించి తిండి మాని పస్తులున్నారు. ఇది హరీశ్ తట్టుకోలేకపోయాడు. తిండి లాక్కోవడం తప్పంటూ బిగ్‌బాస్‌కే క్లాస్ పీకాడు. వాళ్లు తినేవరకు తానూ తినేది లేదని భోజనం ప్లేటు మీద నుంచి లేచాడు. అంతేకాదు, బ్రదర్ నేనున్నా అంటూ సెలబ్రిటీలకు అరటిపండ్లు పట్టుకెళ్లాడు. దాంతో బిగ్‌బాస్ మరోసారి వారించాడు. గుండు అంకుల్.. బెడిసికొట్టిన కామెడీవారిని పస్తులుంచడం తట్టుకోలేని హరీశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అయినా బిగ్‌బాస్ మరీ అంత చెడ్డోడు కాదులే.. ఏదో కాసేపు అలా తినొద్దని భయపెట్టినా తనే స్వయంగా ఫుడ్ పంపించాడు. అంటే కామనర్లకు సెలబ్రిటీలు వండిపెడ్తే.. సెలబ్రిటీలకు బిగ్‌బాస్ ఆహారం పంపిస్తాడన్నమాట! ఇకపోతే ఇమ్మాన్యుయేల్ ఏదో కామెడీ చేద్దామని ప్రయత్నించాడు. హరీశ్‌ను గుండు అంకుల్ అన్నాడు. మొదట ఆయన పట్టించుకోలేదు, కానీ రెండుమూడు సార్లు అనేసరికి చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు? ఎవరు అంకుల్? అని ఫైరయ్యాడు.బాడీ షేమింగ్అప్పటికే హర్ట్ అయ్యాడని గమనించిన ఇమ్ము.. అన్నా సారీ చెప్పా కదా అని సముదాయించాడు. అయినా తగ్గని హరీశ్.. లిమిట్లో ఉండు, బాడీ షేమింగ్ చేయొద్దని హెచ్చరించాడు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా, నెత్తిమీద ఎక్కాలని చూస్తే తొక్కిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చాలాసేపు వీరిమధ్య ఫైట్ నడిచింది. ఆయన గుండు చేయించుకుందే బిగ్‌బాస్ కోసం! అగ్నిపరీక్ష షోలో అరగుండు చేయించుకోమనగానే క్షణం ఆలోచించకుండా సగభాగం షేవ్ చేసుకున్నాడు. అతడిని ధైర్యాన్ని మెచ్చిన బిందుమాధవి.. మరీ అరగుండుతో ఎంతకాలం ఉంటావని పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది. అపరిచితుడు బయటకొచ్చేశాడుఇక బిగ్‌బాస్ షో అంతా అరగుండుతోనే ఉండాలని హరీశ్‌కు కండీషన్ కూడా పెట్టారు. ఈయన ఒక్కరోజులోనే తినమని ప్రేమ, తిననందుకు కన్నీళ్లు, తనపై కామెడీ చేసినందుకు కోపం.. ఇలా అన్నీ చూపించాడు. లైవ్‌లో అయితే వయసెంత అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సరదాగా ఉన్నాడట! మొత్తానికి మొదటిరోజే అపరిచితుడిని చూసేశామన్నమాట! చదవండి: రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్ -
మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని.. అప్పుడే మొదలెట్టేశాడుగా!
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) ప్రతి సీజన్లో ఓ కమెడియన్ కచ్చితంగా ఉండాల్సిందే! ఎప్పుడూ గొడవలతో అగ్నిలా భగభగమండుతూ ఉండే హౌస్‌లో నవ్వుల వర్షం కురిస్తేనే బాగుంటుంది. అందుకే కమెడియన్ ఉంటేనే షోకి కళ. ఈ సారి ఓ ఫేమస్ కమెడియన్‌ను పట్టుకొచ్చారు. అతడే జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Emmanuel). నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ, ఎదుటివారి పెదాలపై నవ్వు చూడటం కోసం తనపై తాను జోకులు వేసుకోవడానికి కూడా వెనుకాడడు.ఒక్క ఛాన్స్తాజాగా బిగ్‌బాస్ 9 స్టేజీపై అడుగు పెట్టిన ఇమ్మాన్యుయేల్ తన జర్నీ వివరించాడు. 'నేను చదివిన చదువుకు ఉద్యోగం రాలేదు. అందుకే అమ్మానాన్నకు చేదోడువాదోడుగా ఉండాలనుకున్నాను. పొలంపనిలో సాయం చేశాను. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఛాన్స్ ఇస్తాడంటారు. అలా నాకు వచ్చిన ఒక్క ఛాన్స్.. నేను కన్న కలవైపు మొదటి అడుగు పడేలా చేసింది. అవకాశం వచ్చింది, కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. నాగార్జునతో కామెడీమూడేళ్లు గడిచిపోయాక మన తలరాత మనమే రాసుకోవాలని అర్థమైంది. వందల స్కిట్లు రాసి, అందులో నటించి మిమ్మల్ని అలరించాను. బిగ్‌బాస్‌లో నా పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను' అంటూ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే తన టాలెంట్‌నంతా బయటపెట్టాడు. నాగార్జునతో.. బిగ్‌బాస్‌లో మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని అంటూ జోకులు మొదలుపెట్టేశాడు. అలాగే ఆడ గొంతుకతో పాట పాడి అలరించాడు. తర్వాత మిమిక్రీ చేశాడు. -
‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ
టైటిల్: గం..గం..గణేశా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.నిర్మాణ సంస్థ:హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్నిర్మాతలు:కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచిరచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి సంగీతం: చేతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడిఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్విడుదల తేది: మే 31, 2024‘బేబీ’లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ మూవీపై హైప్‌ని క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘గం..గం..గణేశా’పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాలతో నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్‌కు గణేష్(ఆనంద్ దేవరకొండ) ఓ అనాథ. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పని చేసే శృతి(నయన్ సారిక)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్ కొడుకుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హర్ట్ అయిన గణేష్..ఎలాగైన భారీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్‌తో కలిసి రూ. 7 కోట్లు విలువ చేసే డైమండ్‌ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్ కోసం అరుణ్ (ప్రిన్స్ యావర్) గ్యాంగ్ గణేష్ వెంటపడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమంగ్ ఓ గణేశ్ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు(సత్యం రాజేశ్)కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు రుద్రా(కృష్ణ చైతన్య) గ్యాంగ్ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ.. రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్నే ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్)కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్ డేవిడ్(వెన్నెల కిశోర్) కారణంగా రుద్రా గ్యాంగ్‌తో పాటు గణేష్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమాండ్ చివరకు ఎవరికి దక్కింది? గణేష్ లైఫ్‌లోకి కృష్ణవేణి(ప్రగతి శ్రీవాస్తవ)ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే మూడు లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ‘గం..గం..గణేశా’ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. కానీ డిఫరెంట్ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్‌తో హిలేరిస్‌గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సింపుల్‌గానే ఉన్నా ఎంటర్టైన్ చేస్తాయి.హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. డైమాండ్ దొంగిలించాలని హీరో ఫిక్సయ్యాక..కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిశోర్ రెడ్డి ట్రాక్.. మరోవైపు గణేష్ ట్రాక్ రెండింటిని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని సాగించాడు. డైమండ్ వినాయకుడి విగ్రహంలోకి చేరడం..దాన్ని కిశోర్ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజావారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్రా గ్యాంగ్, డైమండ్‌ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్టైన్ చేయవు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డైమండ్గా వెన్నెల కిశోర్ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతి సారి థియేటర్లలో నవ్వులు పూశాయి. అదేసమయంలో అరుణ్ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు.. నీలవేణితో గణేష్ నడిపే లవ్‌ట్రాక్ కథకు అనవసరంగా జోడించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో స్వామిజీ(రంజగన్)ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నెగెటివ్ క్లైమాక్స్‌ని ఒప్పుకోరని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేని ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న గణేష్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. డ్యాన్స్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇక జబర్థస్త్ ఫేం ఇమ్మాన్యుయేల్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు శంకర్‌గా ఆయన చక్కగా నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్లుగా నటించిన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక ఇద్దరు తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా..ఉన్నంతలో చక్కగా నటించారు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డేవిడ్‌గా వెన్నెల కిశోర్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రకు మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. కిశోర్ రెడ్డిగా రాజ్ అర్జున్, రుద్రాగా కృష్ణ చైతన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. సన్నివేశాలను చాలా క్రిస్పిగా కట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
బర్త్‌డే సర్ప్రైజ్.. వర్షకు కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్!
బుల్లితెర ఆన్‌స్క్రీన్ జోడి వర్ష, ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ గురించి తెలిసిందే. కామెడీ షో జబర్థస్త్ స్టేజ్‌పై జోడి కట్టి ఎంతో పాపులారిటి సంపాదించుకున్నారు. స్క్రీన్‌పై రియల్ కపుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మీ-సుధీర్ జోడి తర్వాత వీరిద్దరితో జోడి అంతగా గుర్తింపు పొందింది. ఏ షోలో అయినా వీరిద్దరు జతకట్టి ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తున్నారు. ఆ మధ్య మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఈ ఆన్‌స్క్రీన్ జోడి ఇటీవల ఓ షోలో కలిసిపోయారు. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో వర్ష బర్త్‌డేకు ఇమ్మాన్యుయేల్ ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. వచ్చే నెల ఆమె బర్త్‌డే సందర్భంగా కాస్ట్లీ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు. ఈ సందర్భంగా స్వయంగా వర్షని హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యువెల్లరి షాప్‌కు తీసుకెళ్లి ఆమెతో షాపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వ్లాగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే నిజానికి నెక్లెస్ బహుమతిగా ఇవ్వలేదని, తమ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది. -
గ్రామ కార్యదర్శిని చంపి, కాల్చేశారు..!
ఓర్వకల్లు : కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి గ్రామ కార్యదర్శిగా పని చేసిన ఇమ్మానుయేలు దారుణ హత్యకు గురయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇమ్మానుయేలు ఇటీవల సస్పెండ్ అయ్యారు. కాగా, ఆయన సోమవారం నుంచి కనిపించడం లేదు. బుధవారం ఆయన మృతదేహాన్ని ఓర్వకల్లు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పడి ఉండగా గమనించారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన ఆనవాళ్లను స్థానికులు కనుగొన్నారు. సగం కాలిన మృతదేహానికి కొద్దిదూరంలో ఆయన సెల్‌ఫోన్ పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నాగరాజు యాదవ్, ఎస్సై చంద్రబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ బోల్తా.. దంపతులకు తీవ్ర గాయాలు
ఎడ్లపాడు: గుంటూరు జిల్లాఎడ్లపాడు మండలం ఎన్ఎస్ టెక్స్టైల్ వద్ద బైక్ బోల్తా పడిన ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఇమాన్యుయేల్.. ఆయన భార్య బైక్‌పై గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతుండగా.. బుధవారం రాత్రి టవల్.. బండి చక్రంలో పడడంతో బైకు బోల్తా పడింది. ఈఘటనలో తీవ్రగాయాలైన వారిని హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ తిమింగలం
-
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ తిమింగలం
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ ఇమ్మానియేల్ నివాసంపై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గతంలో ఇమ్మానియేల్ మీద ఆరోపణలు రావటంతో ఈ సోదాలు చేపట్టారు. దాదాపు అయిదు కోట్ల వరకూ అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌తోని రెండు ప్రాంతాలతో పాటు వరంగల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సైబర్ నేరం కింద నైజీరియా దేశస్తుడి అరెస్ట్
తిరుచానూరు: సైబర్ నేరానికి పాల్పడ్డ నైజీరియా దేశస్తుడిపై తిరుచానూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అలాగే అతడిని నిర్బంధించిన 16 మందిని సైతం అరెస్టు చేశారు. తిరుచానూరు సీఐ రామకృష్ణాచారి కథనం మేరకు... నైజీరియాకు చెందిన ఇమ్మాన్యుయేల్(39) సంపాదన కోసం ఢిల్లీ వచ్చాడు. అక్కడ మ్యాక్స్‌వెల్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి డబ్బు సంపాదనకు సైబర్ మోసాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన వెంకటరమణ నాయుడుకు లారాజమ అనే మహిళ పేరుతో వీరు ఈ మెయిల్ పంపిం చారు. ‘జింబాబ్వేదేశం శెనగల్ పట్టణంలోని రెస్క్యూ హోమ్‌లో ఉంటున్నాను. అంతర్యుద్ధంలో మా తండ్రి మరణించాడు. ఆయనకు సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తి నా పేరుమీద ఉంది.. రెస్క్యూ హోమ్ నుంచి నేను బయటపడేందుకు డబ్బు అవసరం. ఆ మొత్తాన్ని పంపిస్తే నేను బయటకొచ్చి నాకు సాయం చేసినందుకు అధిక మొత్తంలో నగదు పంపిస్తా’ అని మెయిల్లో తెలిపారు. నగదును ఓ బ్యాంకు అకౌంట్లో వేయాలని తెలిపారు. దీంతో వెంకటరమణ నాయుడు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా సంబంధిత బ్యాంక్ అకౌంట్‌కు రూ.3.61లక్షలు చె ల్లించాడు. కొద్దిరోజుల తరువాత వెంకటరమణ నా యుడికి వారు ఒక పెట్టెను పంపించారు. అందులో అమెరికన్ డాలర్లు ఉన్నాయని, దాంతో పాటు ఒక రసాయనాన్ని పంపించామని, ఆ రసాయనంతో నో ట్లపై రుద్దితే డాలర్లుగా మారుతాయని సూచించారు. ఆ ప్రకారం వెంకటరమణనాయుడు రసాయనాన్ని రుద్దగా నల్లకాగితాలు బయటపడ్డాయి. బాధితుడు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని వారికి వివరించాడు. వారు మరో రసాయనాన్ని వాడాల్సి ఉందని, దీని కోసం ఇంకా డబ్బు పంపించాలని తెలిపారు. దీంతో మోసపోయానని భావించిన వెంకటరమణనాయు డు ఎలాగైనా పోయిన డబ్బును రాబట్టుకునేందుకు పథకం పన్నాడు. ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానంటూ వారికి మెయిల్ చేశాడు. మంగళవారం సాయంత్రం ఇమ్మాన్యుయేల్ విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాడు. వెంకటరమణనాయుడు తో పాటు మరో 15మంది కుర్రాళ్లు అతడిని మంచి మాటలు చెప్పి తనపల్లి సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. డబ్బు చెల్లించాలంటూ డిమాం డ్ చేశారు. తాను నిర్భంధానికి గురైనట్లు తెలుసుకు న్న ఇమ్మాన్యుయేల్ వెంటనే మ్యాక్స్‌వెల్‌కు జరిగిన సంగతి వివరించాడు. అతను పోలీసులకు సమాచా రం ఇచ్చాడు. దీంతో తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, తిరుచానూరు సీఐ రామకృష్ణాచారి, ఎస్ఐ సూర్యనారాయణ సిబ్బంది తో కలిసి మంగళవారం అర్ధ రాత్రి ఆ ఇంటిపై దాడిచేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తెలిసిన వివరాల మేరకు ఇమ్మాన్యుయేల్‌పై బుధవారం సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు. అలాగే ఇమ్మాన్యుయేల్‌ను అక్రమంగా నిర్బంధించినందుకు వెంకటరమణ నాయుడుతో పాటు మరో 15మంది యువకులపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.