
బిగ్‌బాస్ షోలో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్, అతి చేష్టలతో ఎలిమినేషన్ ఏరికోరి తెచ్చుకున్నాడు. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కామనర్‌గా నిలిచాడు. వెళ్తూ వెళ్తూ కామనర్‌పై ఓ బిగ్‌బాంబ్ విసిరాడు. మరి సండే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.. రీతూ చౌదరి వల్ల కెప్టెన్సీ పెంటపెంటయింది. దీంతో కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేసి మళ్లీ గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ కష్టపడి కెప్టెన్సీ సాధించుకున్నాడు. తర్వాత ఓ ఫన్ గేమ్ ఆడించగా అందులో కామనర్స్ గెలిచారు.
మనీష్ ఎలిమినేటెడ్
ఇక నాగ్ ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ రాగా చివరకు ఫ్లోరా, మనీష్ (Manish Maryada) మిగిలారు. ఎలాగో ఫ్లోరా ఎలిమినేషన్ ఖాయమని ఫిక్సయిన కామనర్లు.. ఆమెకు ఆల్ ద బెస్ట్, మిస్ యూ అంటూ డైలాగులు చెప్పారు. తీరా ఫ్లోరా సేఫ్, మనీష్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించగానే అందరూ నోరెళ్లబెట్టారు. మనీష్ వెళ్లేముందు అతడితో ఓ గేమ్ ఆడించారు. ఈ షోలో టాప్ 3 ఎవరు? బాటమ్ 3 ఎవరు? చెప్పాలన్నాడు.
బాటమ్ 3లో శ్రీజ
అందుకు మనీష్ ముందుగా బాటమ్ 3లో శ్రీజ (Dammu Srija) పేరు చెప్తూ తను గేమ్ సరిగా ఆడట్లేదన్నాడు. తర్వాత ఫ్లోరా సైనిని బాటమ్‌లో పెడుతూ.. ఆమె పని తప్ప గేమ్ కనిపించట్లేదన్నాడు. సుమన్‌ను కూడా బాటమ్ 3లో యాడ్ చేశాడు. సుమన్ అన్నా.. హ్యాట్సాఫ్. మీరు ఏం ఆడుతున్నారన్నా.. నేనసలు ఊహించనేలేదు. అయినా బాటమ్‌లో ఎందుకున్నారంటే.. అలా కనిపించి, ఇలా వెళ్లిపోతారు. మీకంటూ ఓ స్టాండ్ తీసుకోరు అని చెప్పుకొచ్చాడు. తర్వాత టాప్ 3 గురించి మాట్లాడాడు.
ఆయనే నెం.1
నా ప్రకారం భరణిగారు నెం.1. ఆయన అందరి కోసం ఆలోచిస్తారు, మరోపక్క గేమ్ కూడా ఆడతారు. మీరు చాలా స్ట్రాంగ్ కంటెండర్. మీలాంటివాళ్లతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు, మీతో ఫైట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయేల్.. మొదట ఇతడిని నేను సీరియస్‌గా తీసుకోలేదు. కామెడీ చేస్తారంతే అనుకున్నా.. కానీ ఇచ్చిపడేసిండు. కామెడీ, ఎమోషన్స్, గేమ్.. అన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మిమ్మల్ని తప్పకుండా టాప్ 3లో చూడాలనుకుంటున్నా.. వేరేవాళ్ల కోసం ఆటను వదిలేయకండి అని సూచనలిచ్చాడు.
అపార్థం చేసుకున్నా..
కామనర్ల నుంచి ఏకైక వ్యక్తిని టాప్ 3లో చేర్చాడు. అతడే హరీశ్. ఎమోషన్స్ దగ్గరే ఆగిపోకండి. కొంచెం కోపం తగ్గించుకుంటే టాప్ 1కి వెళ్తారు అన్నాడు. తర్వాత నాగార్జునను అడిగి మరో వ్యక్తిని టాప్ 4గా వెల్లడించాడు. ఆవిడే సంజన. సంజనను నేను ఎంత అపార్థం చేసుకున్నానో తర్వాత అంత అర్థం చేసుకున్నాను. నాకు, తనకు ఇంట్లో ఏ పనీ లేదు. అయితే పని రాలేదు కాబట్టి తనే పని తెచ్చుకుంటా.. అది కూడా గేమే అంది. అప్పుడే నాకు మైండ్ బ్లాక్ అయింది.
రాత్రి ఒంటరిగా కన్నీళ్లు
పగలంతా అందర్నీ సతాయిస్తుంది. రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఎక్కువ మిస్ అయ్యేది సంజననే.. అని ఎమోషనలయ్యాడు మనీష్. అందరినీ పని అడిగాను, ఎవరూ ఇవ్వలేదు. ఈమె ఒక్కరే నాకు వర్క్ ఇచ్చింది. తనకు నేను వంట చేసి పెట్టాను. మీరు టాప్ 3లో ఉండాలి. భాష నీకు అడ్డు కాదు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనీష్ ధైర్యం చెప్పాడు.
జైల్లోకి ఫ్లోరా..
అందుకు సంజనా.. నేను తెలుగమ్మాయినే, నాకు భాష ఏం అడ్డం కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో మోస్ట్ బోరింగ్ మనిషిగా ఫ్లోరాను ఎంపిక చేశారు. దీంతో ఆమె జైల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆమె చేసే వాష్‌రూమ్ డ్యూటీ టెనెంట్స్‌లో ఒకరికి వేయాలన్నాడు నాగ్. దీంతో ఈ బిగ్‌బాంబ్‌ను మనీష్ ఇది నా రివేంజ్ అంటూ ప్రియకు ఆ క్లీనింగ్ పని అప్పగించి సెలవు తీసుకున్నాడు.
చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే?