నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్‌లో హీరోయిన్
బిగ్‌బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్‌బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్‌లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరైతే కిచెన్‌లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్‌లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి!