
సామాన్యుల్లో నుంచి వజ్రాల్ని వెలికితీసి పంపాలనుకుంది బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) టీమ్. అందుకే అగ్నిపరీక్ష కార్యక్రమం నిర్వహించింది. దానికి బిందుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగానూ వ్యవహరించారు. గేమ్స్ ఆడుతూ, ముక్కుసూటిగా మాట్లాడిన వారిని, చలాకీగా ఉన్నవారిని సెలక్ట్ చేసి పంపారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లోకి వెళ్లాక అంతా రివర్స్ అయింది.
కామనర్లపై నెగెటివిటీ
ఆట సంగతి పక్కనపెడితే మాటలు, గొడవలు, రూల్స్, ప్రవర్తన.. అన్నిరకాలుగా పెంట పెంట చేశారు. దీంతో కామనర్లు మాకొద్దురా బాబూ అని జనం తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే గతవారం కామనర్ల నుంచి మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చంటున్నారు. అందులో ప్రియ పేరు బలంగా వినిపిస్తోంది.
పుట్టుకతో వచ్చిన గొంతు
ఈ క్రమంలో ప్రియ (Priya Shetty) పేరెంట్స్ సురేఖ-వివేకానంద ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వారు మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వద్దనే చెప్పాం. అగ్నిపరీక్షకు ట్రై చేస్తుంటే కూడా వద్దన్నాం. తనే గట్టిపోటీనిస్తానంటూ షోకి వెళ్లింది. అగ్నిపరీక్షలో ఆదరించిన ప్రేక్షకులే ఇప్పుడు బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు విమర్శిస్తున్నారు. పుట్టుకతో వచ్చిన గొంతుకకు మనమేం చేయలేం.
చాలా తప్పు
తను ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుంది. వాయిస్ వల్ల మీకు డిఫరెంట్‌గా కనిపిస్తుందంతే! గొంతు వల్ల ఆమెను ట్రోల్ చేయడం చాలా తప్పు. అగ్నిపరీక్షలో కూడా అదే గొంతుంది. అప్పుడేమో క్యూట్ అంటూ ఓట్లేశారు. ఇప్పుడెందుకు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు? ఈ ట్రోలింగ్ చూస్తుంటే బాధేస్తోంది. బిగ్‌బాస్ వల్ల తన పెళ్లికి ఏమీ ఎఫెక్ట్ కాదు. తనను అర్థం చేసుకునే వ్యక్తితోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు.
చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్‌లో ఉన్నా: ధర్మ మహేశ్